Ads
సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలపై సందేశాలు ఇస్తూ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ మారి సెల్వరాజ్. మారి సెల్వరాజ్ గతంలో దర్శకత్వం వహించిన సినిమాలు కూడా సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాల మీద ఉంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా మామన్నన్. తమిళ్ లో ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : నాయకుడు
- నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, వడివేలు.
- నిర్మాత : ఉదయనిధి స్టాలిన్, M. సేన్బగ మూర్తి, R. అర్జున్ దురై
- దర్శకత్వం : మారి సెల్వరాజ్
- సంగీతం : ఏఆర్ రెహమాన్
- విడుదల తేదీ : జులై 14, 2023.
స్టోరీ :
కథ విషయానికి వస్తే రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) అనే ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, కొన్ని కారణాల వల్ల తన తండ్రి తిమ్మరాజు (వడివేలు) తో మాట్లాడడు. తిమ్మరాజు ఎమ్మెల్యేగా ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలుస్తాడు. రఘువీరాతో పాటు కలిసి చదువుకున్న లీల (కీర్తి సురేష్) పేద విద్యార్థులకు చదువు అందిస్తూ ఉంటుంది. దాని కోసం ఒక ఇన్స్టిట్యూట్ కూడా మొదలు పెడుతుంది. రఘువీరా, లీల చదువుకునేటప్పటి నుండి ప్రేమించుకున్నా కూడా ఒకరిపై ఉన్న ఇష్టాన్ని మరొకరు తెలుపరు. కనీసం మాట్లాడుకోరు.
అయితే లీల పెట్టిన ఇన్స్టిట్యూట్ కి సమస్యలు రావడంతో తిమ్మరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని లీలాకి ఇన్స్టిట్యూట్ కోసం వాడుకోమని ఇచ్చేస్తాడు. అయితే తిమ్మరాజు పార్టీకి చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్), తన అన్నతో కలిసి ఈ ఇన్స్టిట్యూట్ మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రఘువీరా, తిమ్మరాజు మాట్లాడుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? రత్నవేలు ఏం చేశాడు? వీటన్నిటినీ రఘువీరా ఎలా ఆపుతాడు? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా వడివేలు అంటే అందరికీ గుర్తొచ్చేది కామెడీ. వడివేలు తెలుగు సినిమాల్లో నటించకపోయినా కూడా చాలా డబ్బింగ్ సినిమాలో ఆయన కామెడీ చూసినవారు ఆయనకి అభిమానులు అయ్యారు. అలాంటి వడివేలు ఈ సినిమాలో ఒక సీరియస్ పాత్ర పోషించారు. గత రెండు సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి మారి సెల్వరాజ్ చూపించారు.
ఈ సినిమా మొత్తం కూడా పాత్రల్లో నటించే నటీనటులకి కాకుండా కథకి ప్రాముఖ్యత ఇస్తూ నడుస్తుంది. హీరో, విలన్ పాత్రలని సమానంగా చూపించే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. చాలా చోట్ల హీరోని గొప్ప చేయడానికి విలన్ ని తక్కువ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో మాత్రం ఇద్దరినీ సమానంగా చూపించారు. వీరిద్దరితో పాటు వడివేలు పాత్రని కూడా హైలైట్ చేశారు. అసలు సినిమా మొత్తానికి వడివేలు పాత్ర చాలా పెద్ద హైలైట్ అయ్యింది.
సినిమాలో మాట్లాడుకోవడం కంటే ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. చాలా బరువైన సీన్స్ కూడా తక్కువ డైలాగ్స్ తో ఎక్కువ యాక్షన్ తో ఉంటాయి. ఒక రకంగా ఈ సినిమాకి అదే ఒక ప్లస్ కూడా అయ్యింది. ఎందుకంటే సాధారణంగా మెసేజ్ ఉన్న సినిమాలు అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాకుండా ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కువ చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా ఆల్రెడీ నిరూపించుకున్న నటులు.
వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి నిర్మాతగా కూడా మారడం అనేది అభినందించాల్సిన దగ్గ విషయం. కీర్తి సురేష్ తన పాత్రకి తగ్గట్టుగా చేశారు. ఇంక రత్నవేలు పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ పాత్ర తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్రకి కొత్తదనం తీసుకురావడానికి ఫహాద్ ఫాజిల్ నటించిన విధానం చాలా బాగున్నాయి. సినిమాలో షాట్స్ చూపించిన విధానం కూడా చాలా బాగుంది.
కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ లో కూడా బుద్ధుడు బొమ్మలని చూపించడంలాంటివి చేస్తారు, చిన్న చిన్న విషయాలపై కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పాటలు కూడా సినిమాని మరొక లెవెల్ కి తీసుకెళ్లే లాగా ఉన్నాయి. పాటల్లో కూడా సినిమాకి సంబంధించిన కథని చెప్పడానికి ప్రయత్నించారు. దాంతో పాటలు సినిమా ఫీల్ ని తగ్గించకుండా సినిమా ఫ్లోలోనే వెళ్ళిపోతాయి. అయితే ఇలాంటి సినిమాలు కొంచెం స్లో పేస్ లో నడుస్తాయి. దాంతో కొన్ని చోట్ల కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ
- టేకింగ్
- నటీనటుల పర్ఫార్మెన్స్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- ల్యాగ్ అనిపించే కొన్ని సీన్స్
- స్లోగా నడిచే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలని సహజంగా చూపిస్తే ప్రేక్షకులు ఏ భాషలో అయినా సరే ఆదరిస్తారు. సినిమా ఇప్పటికే తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. స్లోగా ఉన్నా సరే కంటెంట్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి నాయకుడు సినిమా ఒక మంచి బలమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article