Ads
తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో యాక్టర్ మనోజ్, స్మితల వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే నటుడు మనోజ్ అనగానే కార్తీక దీపం సీరియల్ యాక్టర్ మనోజ్ కుమార్ కాల్పులు జరిపినట్టుగా ఒక వార్త వైరల్ అయ్యింది.
Video Advertisement
అయితే విషయం తెలిసిన యాక్టర్ మనోజ్ కుమార్ ఈ ఇన్సిడెంట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను హైదరాబాద్ లో లేనని క్లారిటీ ఇచ్చాడు. మరి అసలు మనోజ్ ఎవరు? ఆ స్టోరి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్‌లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి. సమయం కథనం ప్రకారం, సిద్ధార్థ్ దాస్‌తో స్మితతో 2003 లో పెళ్లి జరిగింది. వీరికి 17 సంవత్సరాల కుమారుడు, 13 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. వీళ్లు గతంలో మూసాపేటలో నివసించేవారు. ఈ క్రమంలో సిద్ధార్థ్, స్మితల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో స్మిత 2018లో సిద్ధార్థ్ పై గృహహింస కేసు పెట్టింది.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు. మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్‌ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్‌ను చూసిన స్మితా మనోజ్‌కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్‌ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: కథ ఒకటే… కారణాలు వేరే..! ఏం జరిగిందంటే..?
End of Article