Home Filmy Adda “పవన్ కళ్యాణ్” మొదటి భార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

“పవన్ కళ్యాణ్” మొదటి భార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

by Mohana Priya

అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత వారి జీవితం తెలిసిన పుస్తకం లాంటిదే.

వారి వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ తెలుస్తాయి. అలా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి పవన్ ఎప్పుడూ ప్రస్తావించక పోయినా కూడా అందరికీ తెలుసు. వేల సంఖ్యలో అభిమానులు మరియు అభిమాన సంఘాలు ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఇటు సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు.

pawan kalyan first wife now

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందరికీ పవన్ కళ్యాణ్ రెండవ భార్య అయిన రేణు దేశాయ్ మరియు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్యగా ఉన్న లేజీనావో గురించి బాగా తెలుసు కానీ ఆయన మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 1997 ప్రాంతంలో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ వివాహం జరిగింది.

pawan kalyan first wife now

పెద్దలు కుదిరిచి చేసిన పెళ్లి వివాహం తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకుల వరకు వెళ్ళింది. 2007 లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో విడాకుల భరణం కింద పవన్ కళ్యాణ్ కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు నందినికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2010 లో అమెరికాకు చెందిన కృష్ణారెడ్డి అనే డాక్టర్ ని వివాహం చేసుకొని నందిని ప్రస్తుతం ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

పరస్పరం పసగనప్పుడు విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన భార్యకు ఎప్పుడూ అన్యాయమైతే చేయలేదు. ఆమెకు జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా ఆస్తిని పంచి ఇచ్చారు. అయితే అనవసరంగా ఈ విషయం ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఇటు పవన్ కళ్యాణ్ కే కాదు అటు ఆయన అభిమానులకు కూడా ఎంతో బాధాకరంగా ఉంది.

ALSO READ : “ప్రాజెక్ట్ K” ఈవెంట్‌కు హాజ‌రు కానీ “దీపికా ప‌దుకొనే”.. కారణం ఏమిటంటే..?

You may also like