Ads
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ మరియు గ్లింప్స్‌ను ప్రతిష్టాత్మక ‘కామిక్ కాన్ 2023’ ఈవెంట్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.
Video Advertisement
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ రివీల్ అయింది. ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ‘ప్రాజెక్ట్ k’ లో ఏముంది? అనే విషయాన్ని గ్లిమ్ప్స్ రూపంలో చూపించారు. ఈ గ్లిమ్ప్స్ నిడివి 1 నిముషం 16 సెకన్ల ఉంది. ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. “ప్రపంచాన్ని చీకటి కమ్మినపుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడే అంతం మొదలవుతుంది ” అని ప్రారంభం అయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించేలా ఉంది.
హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ మరియు గ్రాఫిక్స్ విజువల్స్ అదిరిపోయాయి. సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ, లుక్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ దీపికా పదుకొనే పాత్రని ఆసక్తికరంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ‘వాటీజ్ ప్రాజెక్ట్- K’ అనే డైలాగ్‌తో మూవీ పై మరింత ఇంట్రెస్ట్ ను పెంచారు. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పై అంచనాలు మరింత పెరిగాయి.
శాన్‌డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్‌లో విడుదలైన తొలి భారతీయ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డ్ సృష్టించింది. ఈ వేడుకలో కమల్ హాసన్, హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి తదితరులు సందడి చేశారు. ఇది ఇలా ఉంటే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
1. 2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :
End of Article