Home Filmy Adda జబర్దస్త్ శాంతి కుమార్ దర్శకత్వం, సాయి కుమార్, ఆదిత్య ఓం హీరోలు..! ఈ సినిమా చూశారా..?

జబర్దస్త్ శాంతి కుమార్ దర్శకత్వం, సాయి కుమార్, ఆదిత్య ఓం హీరోలు..! ఈ సినిమా చూశారా..?

by Sainath Gopi

ఇటీవల జబర్దస్త్ కమెడియన్ వేణు ‘బలగం’ మూవీ ద్వారా దర్శకుడిగా  మారి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్‌ దర్శకుడిగా మారి ‘నాతో నేను’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ గా పేరు గాంచిన సాయి కుమార్‌, ఆదిత్యా ఓం, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు.  బుల్లితెరపై తన కామెడీతో అలరించిన శాంతి కుమార్‌ దర్శకుడిగా తెరకెక్కించిన ‘నాతో నేను’  సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఉన్నత స్థానానికి ఎదిగిన కోటీశ్వరరావు(సాయికుమార్‌) సడెన్ గా చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో కోటీశ్వరరావు ఉండే గ్రామానికి వచ్చిన ఒక స్వామిజీ అతని కష్టాన్ని విని ఒక వరమిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అంటాడు. స్వామిజీ కోటేశ్వరరావుకు ఇచ్చిన వరం ఏమిటి? వరం పొందిన తరువాత కోటేశ్వరరావు జీవితంలో కష్టాలు పోయాయా? కోటేశ్వరరావు జీవితంలో నాగలక్ష్మీ (దీపాళీ), దీప (ఐశ్వర్య) ఎవరు అనేవాటికి సమాధానమే మిగిలిన కథ.
మనిషి అనే దానికన్నా డబ్బు మీదే ఆధారపడి జీవితం నడుస్తోంది అనే కథతో తెరకెక్కిన సినిమా. 20, 40, 60  వయసు స్టేజ్ ల వారీగా సాగిన ఈ స్టోరీలో సాయికుమార్‌, సాయి శ్రీనివాస్‌, ఆదిత్యా ఓం, పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సీన్స్ ను దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. మంచి చేసినపుడు అది ఎక్కడికి పోదు అనే విషయాన్ని చక్కగా చూపించారు. కోటీశ్వరుడిగా సాయికుమార్‌ అద్భుతంగా నటించారు. సాయికుమార్‌ డైలాగ్‌లు బాగున్నాయి.
ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఆదిత్య ఓం, బ్రేకప్ అయిన యువకుడిగా సాయి శ్రీనివాస్‌ చక్కగా నటించారు. రాజీవ్‌ కనకాల, సీవీఎల్‌ నరసింహరావు బాగా నటించారు. సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య క్యారెక్టర్లు యువతకి బాగా కనెక్ట్‌ అవుతాయి. తొలిసారి డైరెక్షన్ చేసిన శాంతి కుమార్‌ స్టోరీనే బాగా రాశారు. కానీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. ఫీల్ గుడ్ మూవీ అందించేందుకు ప్రయత్నించారు. ఎంత డబ్బు సంపాదించిన మనిషికి మన అనుకునే తోడు లేకపోతే వారి జీవితంలో సంతోషంగా ఉండదు అనడానికి  నిదర్శనమే ‘నాతో నేను’ మూవీ.

Also Read: ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అంతగా ఏం ఉంది ఇందులో..?

You may also like