Ads
తెలుగులో చిన్న సినిమాగా విడుదలై భారీ సక్సెస్ను అందుకున్న మూవీ ‘సామజవరగమన’. ఇందులో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రెబా మోనికా జాన్. అయితే ఈమె మొదట బ్రో మూవీ లుక్ టెస్ట్ కోసం టాలీవుడ్ కు రావడం జరిగింది.
Video Advertisement
అయితే అందులో ఛాన్స్ దొరక్కపోయినా అనుకోకుండా సామజవరగమన లాంటి మూవీ దొరకడం ….అది ఊహించనంత సక్సెస్ కావడం ..అన్ని ఆమెకు అలా కలిసి వచ్చాయి.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెబా తన గురించి , తన కెరీర్ గురించి ప్రస్తావించారు. మలయాళీ అయిన రెబా బెంగళూరులోనే పుట్టి పెరిగింది. చదువు పూర్తయిన తర్వాత కొన్ని సినిమాలు చేసింది.‘ఫారెన్సిక్’అనే మూవీ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానంతో అతనితో కలిసి సినిమా చేయాలి అన్న అభిలాషతో బ్రో మూవీ కోసం వచ్చిన తనకి ఛాన్స్ మిస్ అయింది.
అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా సామజవరగమన నిర్మాత రాజేష్ ను కలవడంతో ఆమెకు మూవీలో ఛాన్స్ వచ్చిందట. మలయాళం ,తమిళ్ ,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ ఈ మూవీలో తాను పోషించిన పాత్రను మెచ్చుకుంటూ అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో సహా ఎందరో ట్వీట్ చేశారని రెబా తెలిపారు. అందుకే తనకు ఈ మూవీ ఎంతో స్పెషల్ అని కూడా ఆమె చెప్పారు. బిగిల్ చిత్రంలో దళపతి విజయ్ పక్కన చిన్న పాత్రలో నటించినప్పటికీ అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రెబా అన్నారు. కథ నచ్చితే తిరిగి అలాంటి పాత్రలు తెలుగులో చేయడానికి కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె అన్నారు.
ALSO READ : ఆడేది తక్కువ… పొగరు ఎక్కువ..! అసలు ఈ ప్లేయర్ కి ఇంకా ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారో..?
End of Article