“రోజూ తాగొచ్చి దేవుడు అంటే ఎవరు నమ్మరు” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” పై డైరెక్టర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“రోజూ తాగొచ్చి దేవుడు అంటే ఎవరు నమ్మరు” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” పై డైరెక్టర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

కశ్మీర్ ఫైల్స్ 1990ల్లో కశ్మీర్‌లో హిందువుల పై జరిగిన మారణ హోమాన్ని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం. విమర్శకులు సైతం మెచ్చుకునే విధంగా రూపొందిన ఈ చిత్రం దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అయితే ఇతను ప్రస్తుతం ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

Video Advertisement

రీసెంట్ గా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఎటువంటి విమర్శలు ఎదుర్కొందో మనందరికీ తెలుసు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదట కలెక్షన్స్ పరంగా బాగున్నప్పటికీ ఆ తర్వాత వెల్లువెత్తుతున్న నెగిటివిటీ కారణంగా క్రమంగా థియేటర్లు కూడా వెలవెల పోయాయి.

రాముడి జీవిత చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్నో సంఘటనలు మరియు సన్నివేశాలను డైరెక్టర్ ఓం రౌత్ తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చడంతో చిత్రం పెద్ద వివాదానికి దారి తీసింది. హనుమంతుడు చేత మాస్ డైలాగ్స్ చెప్పించడం దగ్గర నుంచి రావణాసురుడి లంక వరకు రామాయణానికి ఎక్కడా పొంతన లేకుండా తెరకెక్కించడంతో ఈ చిత్రంను పలుచోట్ల బ్యాన్ చేయవలసిందిగా ప్రేక్షకులు డిమాండ్ చేసే వరకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ప్రభాస్ గురించి వివేక్ అగ్నిహోత్రి అన్న మాటలు …డార్లింగ్ ఫాన్స్ కు బాధ కలిగించే విధంగా ఉన్నాయి.

vivek-agnihotri-tweet-on-salaar

“స్క్రీన్ మీద నేను దేవుని అనంతమాత్రాన ఎవరూ దేవుడు అయిపోరు. ప్రతిరోజు వారు తమ జీవితంలో ఎటువంటి లైఫ్ గడుపుతున్నారు అన్న విషయాన్ని కూడా జనాలు గమనిస్తారు. రోజు రాత్రి తప్ప తాగి తిరుగుతూ…. పొద్దున స్క్రీన్ ముందుకు వచ్చి నేను దేవుణ్ణి అని చెబితే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదు…” అని వివేక్ అగ్నిహోత్రి అన్న మాటలు పరోక్షంగా ప్రభాస్ ఆది పురుష్ మూవీ గురించే అన్న చర్చ జరుగుతుంది. రీసెంట్‌గా అతను సలార్ టీజర్ పై కూడా ఇండైరెక్టుగా ప్రభాస్‌ను విమర్శించారు. ఇక దీనిపై ప్రభాస్ ఫాన్స్ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

ALSO READ : ఆడేది తక్కువ… పొగరు ఎక్కువ..! అసలు ఈ ప్లేయర్ కి ఇంకా ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారో..?


End of Article

You may also like