Ads
స్వయంవరం తో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణు. మంచి టైమింగ్ ఉన్న కామెడీ.. బేస్ వాయిస్.. సిచువేషన్ కి తగ్గ ఎక్స్ప్రెషన్స్ తో వేణు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.
Video Advertisement
సినిమాల్లో వేణు డైలాగ్స్ చెబుతూ ఉంటే అతని వాయిస్ చాలా బాగుంటుంది అని అందరూ అనుకుని ఉంటారు కదూ.. అయితే ఇప్పటివరకు వేణు సినిమాల్లో వాయిస్ అతనిది కాదు అని తెలిస్తే నమ్ముతారా..
అవునండి బాబు ఇప్పటివరకు 25 సినిమాలకు పైగా నటించిన వేణు తొట్టెంపూడి ఒక్క చిత్రంలో కూడా తన ఒరిజినల్ వాయిస్ వాడలేదు. ఆయనకు ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పింది వాయుపుత్ర నాగార్జున గారు. వేణు డైలాగ్ చెప్తే వినడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది అని అందరూ అంటారు అయితే అందులో ఎక్స్ప్రెషన్ మాత్రమే వేణు ది వాయిస్ వేరే వాళ్లది అని తేలిపోయింది.
వృత్తి రీత్యా కాలేజీ ప్రొఫెసర్ అయిన వాయుపుత్ర నాగార్జున గారు ఇప్పటికీ టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెప్పారు. స్టైల్ ,సంతోషం మూవీస్ లో ప్రభుదేవా కి డబ్బింగ్ చెప్పింది ఈయనే. సరైనోడు మూవీ లో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ జయప్రకాష్‌కు, దూకుడు సినిమాలో సుమన్‌కు ,అపరిచితుడులో హీరో ఫ్రెండ్ గా నటించిన వివేక్‌కు ,సత్యం శివం మూవీలో మాధవన్‌కు.. ఇలా ఎంతోమందికి వాయుపుత్ర నాగార్జున డబ్బింగ్ చెప్పారు. అయితే చాలామంది ఈ విషయం తెలియక వాళ్ళందరికీ డబ్బింగ్ వేణు చెప్పాడని బ్రమపడ్డారు.
ఏ నటుడి కైనా పర్ఫెక్ట్ గా అతని బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే విధంగా డబ్బింగ్ చెప్పడంలో వాయుపుత్ర నాగార్జున స్పెషలిస్ట్. ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్టులకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. నిజం చెప్పాలి అంటే సినిమాలో వాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైనది కానీ తెరవెనకే మిగిలి పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ల గొంతుకు గుర్తింపు ఉన్నప్పటికీ ఆ గొంతుకు వెనక ఉన్న పేరుకి ,దాని భావనలకు ఎటువంటి గుర్తింపు రావడం లేదు.
watch video :
ALSO READ : “దేవర” మూవీ కోసం ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్..!
End of Article