Home Filmy Adda “అణుబాంబు” తయారుచేసిన సైంటిస్ట్ కి భగవద్గీతతో ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఈ వివాదం ఏంటి..?

“అణుబాంబు” తయారుచేసిన సైంటిస్ట్ కి భగవద్గీతతో ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఈ వివాదం ఏంటి..?

by Sainath Gopi

‘అణుబాంబు పితామహుడు’ గా పేరుగాంచిన జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఓపెన్‌హైమర్’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇండియాలో కూడా ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్లను సాధించింది.

భారీ అంచనాలతో ఇండియాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్ప‌టికే 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, విజయాన్ని అందుకుంది. కానీ ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో భగవద్గీతలోని శ్లోకం చదవడం వల్ల వివాదానికి దారి తీసింది. దీనిపై భారతీయులు నిరసనలు, ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  Oppenheimer-movie-telugu-addaబీబీసి న్యూస్ కథనం ప్రకారం, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓపెన్‌హైమర్’. ఈ మూవీ జులై 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, భారీ కలెక్షన్స్ సాధిస్తూ, దూసుకెళ్తోంది. ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి, హిట్ అయినప్పటికీ, ఈ మూవీ పై భారతీయుల నుండి విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2  రోజుల ముందు ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్‌కు బర్క్‌లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్‌హైమర్‌కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్‌హైమర్‌ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.

Also Read: హీరో “వేణు” ది సినిమాల్లో సొంత గొంతు కాదా..? వేణుకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ ఎవరంటే..?

You may also like