Ads
ఉద్యోగం అనేది ప్రతిభను చూసి ఇస్తారనే విషయం తెలిసిందే. కానీ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక యువతికి వింత అనుభవం ఎదురైంది. అర్హతలు ఉన్నప్పటికీ ఆమె తెల్లగా ఉందనే కారణంతో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు.
Video Advertisement
ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ యువతి తెల్లగా ఉన్నాననే కారణంతో తనకు ఉద్యోగం ఇవ్వలేదని, ఆమె వాపోయింది. సదరు యువతి తన బాధని సోషల్ మీడియాలో చెప్పుకోవడంతో తాజాగా ఈ విషయం బయటకి వచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ప్రతీక్ష జిక్కర్ అనే యువతి బెంగళూరులోని ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ ప్రకటన చూసి ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. అలా వెళ్ళి ఆమె 3 రౌండ్ల వరకు జరిగిన ఇంటర్వ్యూలో నెగ్గింది. కానీ ఉద్యోగానికి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఆమె జాబ్ కి సెలెక్ట్ ఎందుకు కాలేదో సదరు కంపెనీ కారణాన్ని తెలుపుతూ ఆమెకు మెయిల్ ను పంపించింది.
ఆ మెయిల్ లో ఏముందంటే, ‘జాబ్ పొందడానికి కావలసిన అన్ని అర్హతలు, నైపుణ్యాలు మీకు ఉన్నాయి. అయితే మీ స్కిన్ టోన్ మా టీంతో మ్యాచ్ అవలేదు. మీ స్కిన్ కలర్ తెల్లగా ఉండటం వల్ల మా టీంలో విభేదాలు వస్తాయని కంపెనీ యాజమన్యం భావించింది. అందువల్ల మీకు ఈ జాబ్ ఇవ్వలేం’ అని మెయిల్‌లో సదరు కంపెనీ పేర్కొంది. ఈ మెయిల్ తో ఖంగు తిన్న ప్రతీక్ష జిక్కర్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ మెయిల్ స్క్రీన్ షాట్‌ను తీసి సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేసింది.
వాస్తవానికి కంపెనీ మెయిల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయాను, మనిషి కలర్ బట్టి కూడా జాబ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. మనిషి రంగును బట్టి కాకుండా టాలెంట్ ను బట్టి జాబ్ ఇవ్వాలని సదరు కంపెనీని ఈ పోస్ట్ లో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: దయనీయ స్థితిలో తెలంగాణ యువతి… మంత్రికి లేఖ రాసిన తల్లి..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!
End of Article