Ads
కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
Video Advertisement
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ జన్మ ధన్యమైనదని భక్తులు భావిస్తారు. తిరుమల ఎంత ప్రసిద్ధి చెందిందో, తిరుపతి లడ్డులు కూడా అంతే ప్రసిద్ధి చెందాయి. దర్శనానికి వెళ్లే భక్తులకే కాకుండా, ఆ భక్తులు తీసుకొనివచ్చే లడ్డుల కోసం చాలా ఇష్టంగా ఎదురుచూసేవారు ఎంతో మంది ఉంటారు.వెంకన్న ప్రసాదాల్లో లడ్డు ముఖ్యమైనది. అన్ని హిందువుల పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డుల కన్నా తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదని చెప్పవచ్చు. తిరుపతిలో దొరికే లడ్డు యొక్క రుచి, సువాసన వేరే లడ్డుకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా లభించింది. దాని ప్రకారం ఈ లడ్డు తయారీ పద్ధతి ఎవ్వరూ అనుకరించకూడదు. మధురమైన తిరుపతి లడ్డుల తయారీ కోసం గత యాబై సంవత్సరాల నుండి నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. తిరుమలలో నిత్యం దాదాపు 3 లక్షల లడ్లు తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ లడ్డుల తయారీలో సుమారు 700 మంది పోటు కార్మికులు పని చేస్తున్నారు. తాజాగా టీటీడీ అధికారులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. లడ్డు తయారీలో నందిని నెయ్యిని ఉపయోగించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు.నందిని నెయ్యిని కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) తయారు చేస్తుంది. ఈ నెయ్యిని వాడకూడదని నిర్ణయించారు. ఈ మేరకు కేఎంఎఫ్‌తో ఇన్నాళ్ళూ ఉన్న కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయకూడదనే డిసైడ్ అయ్యారు. దీనికి కారణం కేఎంఎఫ్ నందిని నెయ్యి ధరను పెంచడమే. ఇక ఈ విషయాన్ని కేఎంఎఫ్ ఛైర్మన్ ధ్రువీకరించారు. టీటీడీ చెప్పిన ధరకు నందిని నెయ్యిని సరఫరా చేయలేమని తెలిపారు. నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసే టెండర్ల విధానంలో పాల్గొనట్లేదని వెల్లడించారు.
Also Read: ఒకేసారి ప్లేటులో 3 రొట్టెలు వడ్డిస్తే ఏమవుతుందో తెలుసా.? అశుభమని ఎందుకు అంటారంటే.?
End of Article