యంగ్‌ హీరోపై సంచలన ట్వీట్ చేసిన బాహుబలి నిర్మాత.. ట్వీట్ వైరల్..!

యంగ్‌ హీరోపై సంచలన ట్వీట్ చేసిన బాహుబలి నిర్మాత.. ట్వీట్ వైరల్..!

by kavitha

Ads

ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డకు బాహుబలి మూవీతో మంచి గుర్తింపు లభించింది. సామాజిక మధ్యమాలకు దూరంగా ఉండే శోభు యార్లగడ్డ, ఇండస్ట్రీలో నచ్చని విషయాన్ని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

Video Advertisement

తాజాగా శోభు యార్లగడ్డ చేసిన ఒక ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అది కూడా ఒక యంగ్ హీరో ఒక మంచి హిట్ చిత్రాన్ని తన ఆటిట్యూడ్‌ కారణంగా వదులుకున్నాడని ఆ ట్వీట్ సారాంశం. అయితే ఏం అయ్యిందో ఏమో కానీ ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఇక నెటిజన్లు ఆ హీరో మరియు మూవీ ఏంటని చర్చిస్తున్నారు.
శోభు యార్లగడ్డ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ మధ్య కాలంలో విజయాన్ని అందుకున్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్‌ కారణంగా హిట్ చిత్రాన్ని వదులుకున్నాడు. సక్సెస్ వచ్చిన అనంతరం, దానిని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలని, ఒక కొత్త దర్శకుడు స్క్రిప్ట్ చెప్పడం కోసం సదరు హీరో దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను ఆటిట్యూడ్‌తో గౌరవం ఇవ్వలేదని, ఇలాంటి విధానం ఆ హీరో కెరీర్‌కు ఎంత మాత్రం కూడా మంచిది కాదు.అయితే ఈ విషయాన్ని ఆ హీరో త్వరలోనే గ్రహిస్తాడని ఆశిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసినవారు ఆ యంగ్ హీరో విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబీ మూవీ కథను చెప్పడానికి విశ్వక్‌ సేన్‌ వద్దకి వెళ్తే, కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశాడని దర్శకుడు సాయి రాజేష్‌ పరోక్షంగా తెలిపాడు.దాని పై విశ్వక్ స్క్రిప్ట్ విని రిజెక్ట్ చేయడం కన్నా ముందే నో అని చెబితే బెటర్ అని ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చాడు. దాంతో ఆ హీరో విశ్వక్ సేన్ అని భావించారు. అయితే శోభు యార్లగడ్డ విశ్వక్ సేన్ గురించి ఆ ట్వీట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ట్వీట్ తో ఆ చర్చ ముగిసింది. మరి శోభు యార్లగడ్డ చెప్పిన ఆ హీరో ఎవరా అని నెటిజెన్లు మళ్ళీ వెతుకుతున్నారు.

Also Read: ఈ అబ్బాయి తండ్రికి మన ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు..! ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like