“భోళా శంకర్” ఇన్‌సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

“భోళా శంకర్” ఇన్‌సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా,  కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి స్టేజ్ కు చేరుకున్నట్టు సమాచారం. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్ గా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Video Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలుకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఈనెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఓవర్సీస్ లో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటివరకు 15 వేల డాలర్ల వరకు వచ్చాయని తెలుస్తోంది.
bhola-shankarదర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాలలోని హీరోలను చాలా స్టైలిష్ గా చూపిస్తాడని తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ను ఎలా చూపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన భోళా మానియా పాటలో  మెగాస్టార్ చిరంజీవి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.comments on this point in bholaa shankar teaserఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తుండగా, యంగ్ హీరో సుశాంత్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా,  మూవీ అవుట్‌పుట్ ఎబౌవ్  యావరేజ్ అని, ఒక్కసారి చూడవచ్చు అని వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా భారీ నష్టం రావడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ కావచ్చు అని ఇన్‌సైడ్ టాక్. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ గత చిత్రాలు ప్లాప్ అవగా, వాటివల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో మంచి టాక్ వస్తే, మూవీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Also Read: “సాయి ధరమ్ తేజ్” తో ఉన్న హీరోను గుర్తు పట్టారా..? ఇలా మారిపోయాడేంటి?


End of Article

You may also like