“గద్దర్” చనిపోవడానికి కారణాలు ఇవేనా..? రిపోర్ట్ లో ఏం చెప్పారంటే..?

“గద్దర్” చనిపోవడానికి కారణాలు ఇవేనా..? రిపోర్ట్ లో ఏం చెప్పారంటే..?

by kavitha

Ads

ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు ఒక్కసారిగా మూగబోయింది. అనారోగ్యంతో అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పటల్ లో చేరిన గద్దర్ ఆగస్టు 6 (ఆదివారం) నాడు చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు.

Video Advertisement

తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతో ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గొంతు మూగపోయింది. గద్దర్ మరణంతో తెలగాణ వ్యాప్తంగా విషాదం నెలకొంది. రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ భౌతిక కాయానికి నిన్న నివాళులు అర్పించారు. పలువురు సామాజిక మాధ్యమాలలో తమ సంతాపాన్ని తెలిపారు.
gaddar-telugu-adda ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్‌లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్‌ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు. గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్‌లో ప్రకటించారు.
గద్దర్‌ అంత్యక్రియలను నేడు ఆల్వాల్ లోని మహా బోధా స్కూల్‌లో నిర్వహిస్తారని తెలుస్తోంది. గద్దర్‌ కు నివాళులు అర్పించడం కోసం ప్రజలతో పాటుగా, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. గద్దర్ తో తమకున్న ఙ్ఞాపకాలను, అనుబంధాన్ని తల్చుకుంటూ వారు భావోద్వేగానికి లోనవుతున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే వచ్చి, గద్దర్ బౌతీక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు.

Also Read: విశాఖపట్నం కానిస్టేబుల్ కేసులో బయటికొచ్చిన మరొక నిజం..! అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like