“భోళా శంకర్” కి సెన్సార్ బోర్డ్ షాక్..! ఆ సీన్ లీక్..!

“భోళా శంకర్” కి సెన్సార్ బోర్డ్ షాక్..! ఆ సీన్ లీక్..!

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈ మూవీలో సుశాంత్, రష్మీ గౌతమ్,శ్రీముఖి ముఖ్యమైన పాత్రలలో నటించారు.

Video Advertisement

ఆగస్ట్ 11న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ మూవీ సెన్సార్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
comments on this point in bholaa shankar teaser హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని ఒకే చేస్తూ, ఆ చిత్రాలలో నటిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత చిరంజీవి పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సాధించింది. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ ‘వేదాళం’ కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆదివారం (ఆగస్టు 6న) ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ 2 రోజుల క్రితమే సెన్సార్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి  రెండు గంటల 39 నిమిషాల 49 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకి సెన్సార్ బోర్డు జారీ చేసిన రిపోర్టు బయటకు వచ్చింది. ప్రధానంగా ఈ చిత్రంలో మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలకు వచ్చే సమయంలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను హైలైట్ చేశారు. అదే కాకుండా డ్రగ్స్ సన్నివేశాల సమయంలోనే కూడా ఇలాంటి హెచ్చరికను  పెట్టించారు. అంతేకాకుండా ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందుగా వచ్చే సన్నివేశంలో హీరో చిరంజీవి విలన్ తలను నరకడం హింసాత్మకంగా ఉందని, 6సెకెన్లు ఉన్న ఈ సీన్ కట్ చేశారు. ఈ సీన్ ప్లేస్ లో చిరంజీవి, తమన్నా క్లోజప్ షాట్‌ను జతపరిచారు. అలాగే  ఇటీవల దసరాలో కూడా ఉన్న ఒక పదంతో వచ్చే డైలాగును సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేయించారని రిపోర్టులో చూపారు.

Also Read: మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!


End of Article

You may also like