Ads
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం నాడు రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు కోసం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించగా 131 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 102 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లుకు ఉభయ సభలూ ఆమోదం తెలపడంతో బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించనున్నారు.
Video Advertisement
రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారుతుంది. ఓటింగ్ ప్రక్రియకు ముందు బిల్లు పై జరిగిన చర్చా సమయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చెయిర్ లో రాజ్యసభకు వచ్చారు. ప్రస్తుతం రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.
Also Read: “గద్దర్” చనిపోవడానికి కారణాలు ఇవేనా..? రిపోర్ట్ లో ఏం చెప్పారంటే..?
End of Article