Ads
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. సినీ స్టార్స్ ను చూసినవారికి వారిలా జీవించాలని కోరుకుంటారు. కానీ వారి జీవితంలోని చీకటి నిజాలు ఎవరికి తెలియవు. సినీ ఇండస్ట్రీ బయటి నుంచి ఎంతో గ్లామర్‌గా కనిపించవచ్చు. అయితే వాస్తవంగా అందులో ఉండే వ్యసనాల గురించి అందులో ఉన్నవారికే తెలుసు.
Video Advertisement
చాలా మంది తారలు మద్యపాన వ్యసనం గురించి పలు సందర్భాలలో అంగీకరించారు. మద్యపానం కారణంగా తమ కెరీర్‌ను దాదాపు నాశనం చేసుకున్న సెలబ్రిటీలు ఆ తరువాత దానిని నుండి బయటపడ్డారు. మరి అలాంటి సినీ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం..1. సూపర్ స్టార్ రజినీకాంత్:
సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు గాంచిన రజినీకాంత్ కూడా గతంలో ధూమపానం మరియు మధ్యపానంకు బానిసగా మారి కెరీర్ లో ఇబ్బంది పడ్డాడు. కానీ తన భార్య వల్ల వాటిని వదిలేసి సూపర్ స్టార్ గా ఎదిగానని పలు ఇంటర్వ్యూలలో బహిరంగంగానే వెల్లడించారు.
2. ధర్మేంద్ర:
బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర మధ్యపాన వ్యసనంతో ఎన్నో సంవత్సరాలు తన కెరీర్ ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అందులో నుండి బయటి వచ్చి మళ్ళీ సినిమాలలో నటిస్తున్నారు.
3. మనీషా కోయిరాల:
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ మనీషా కోయిరాల. ఈమె ఆల్కహాల్ కు అలవాటు పడి తన కెరీర్ ను పొగొట్టుకుంది. ఈ వ్యసనమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె అంగీకరించింది.
4. సంజయ్ దత్:
బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో సంజయ్ దత్ డ్రగ్స్ మరియు ఆల్కహాల్ వ్యసనానికి బానిస అయ్యి, కెరీర్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్ళి ఆ వ్యసనాల నుండి బయటపడి, ప్రస్తుతం విలన్ గా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా రాణిస్తున్నారు.
5. ఫర్ధీన్ ఖాన్:
ఫర్ధీన్ ఖాన్ స్టార్ హీరోగా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. కానీ అదే సమయంలో ఆల్కహాల్ వ్యసనానికి బానిస అయ్యి, కెరీర్ ను పోగొట్టుకున్నాడు. మళ్ళీ సినిమాలలో నటించడానికి రెడీ అవుతున్నాడు.
6. పూజా భట్:
ఒకప్పటి బాలీవుడ్ అందాల తార, దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో మద్యపానానికి బానిస అయ్యింది. ఆమె తండ్రి వల్ల ప్రస్తుతం ఆ వ్యసనం నుండి కోలుకుంది.
Also Read: “మహేష్ బాబు – త్రివిక్రమ్” సినిమాతో పాటు… “సంక్రాంతి – 2024” కి రిలీజ్ అవుతున్న 6 పెద్ద సినిమాలు..!
End of Article