Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన సినిమా ‘బ్రో’. ఈ మూవీ కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించారు. హీరోయిన్ గా కేతిక శర్మ నటించింది.
Video Advertisement
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చిన బ్రో మూవీ భారీ అంచనాల మధ్య 28న విడుదల అయ్యింది. అయితే మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎలాంటి ప్రశ్నలకు అయిన జవాబు లభించే కోరాలో బ్రో మూవీ ఎలా ఉందని అడుగగా, ఒక యూజర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
“బ్రో సినిమా ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి ఆచంట రామకృష్ణ అనే యూజర్ ఇలా చెప్పుకొచ్చారు. “BRO (బ్రో )మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులు నా మీద కోప్పడతారని ఇంతవరకూ రాయలేదు. రిలీజ్ అయిన చాలా రోజుల తరువాత నిన్న రాత్రి చూడటం జరిగింది. సినిమాలో ఒక సంతృప్తి ఉంది. సీన్స్ కి సీన్స్ కి మధ్యలో చాలా లాగ్ ఉన్నది. వినోదయ సిత్తం ఒరిజినల్ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తమిళ సినిమాలో హీరోకి 67 ఏళ్లు ఆయన తంబి రామయ్య అని ఒక సీనియర్ యాక్టర్ మరియు దర్శకుడు సముద్రఖని కలిసి నటించారు.
ఇవన్నీ తెలుగులో పూర్తిగా మార్చారు. కానీ సినిమాలో అవసరమైన ఇంటర్ loods లేవనే చెప్పాలి. సినిమా సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. ఆయన దృష్టి అంతా అంతర్లీనంగా భావం ఉండే డైలాగ్స్ మీద. సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా మరో అజ్ఞాతవాసి రచన చేశారా? అనిపించింది. ఎంతో హాస్యాన్ని పండించవచ్చు. యమలోకం భూలోకం కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో వినోదాన్ని పంచే ఈ సినిమాలో చాలా అవకాశం ఉంది. దర్శకత్వం సముద్రఖనికి ఇవ్వడం మరో పెద్ద తప్పు.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటుంది. ఇది హాస్యం పండించగల సీనియర్ తెలుగు దర్శకుడికి గాని లేదా వేరే కొత్త డైరెక్టర్ కి ఇచ్చినా మరింత హాస్యాన్ని పండించేవారు. పాటలు కూడా ఆశాజనకంగా లేవు. సినిమా హాల్లో స్పందన కరువైంది. శ్యాంబాబు పృధ్వి ఎపిసోడ్ అసలు పెద్దగా ఏమీ లేనేలేదు. అయినా సినిమా మొదట్లో వేసిన విజ్ఞాపన disclimer ప్రకారం ఈ సినిమాలో ఏ జంతువుల్ని హింసించడం జరగలేదు అని ముందే రాశారు. మొత్తానికి బ్రో సినిమా ఫ్లాప్ అని అనలేము హిట్ అని అనలేము.
బహుశా ఈ చిత్రానికి పని చేసిన సినీ కళాకారులు మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లాంటి పెద్ద పెద్ద పేర్లు చూసి మనలో అంతర్లీనంగా ఉన్న ఒక బాధేమో ? స్థూలముగా అంతగా ఆకట్టుకోలేని సినిమా. పదేపదే సినిమాల్లో గతంలో పవన్ కళ్యాణ్ చార్ట్ బస్టర్ పాటలు వినిపించడం తీవ్ర అనారోగ్యనికి లోనయ్యా. ఏదైనా ఒక పాట రెండు సెకండ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అభిమానులకి కిక్ ఉంటుంది.పూర్తి స్థాయిలో పెడితే ఇలాగే ఉంటుందని ఇదొక పెద్ద విఫల ప్రయోగం. చెప్పాలంటే నాకు సినిమా అరగలేదు వేడి చేసింది. అజీర్ణంగా ఉంది. అందుకని ధనియాలు జీలకర్ర నిమ్మకాయ రసం తాగా. సినిమా కాన్సెప్ట్ మూల కథ మంచిదండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు క్షమాపణలతో, ఒకసారి వీక్షణకు ఉపయుక్తం” అంటూ రాసుకొచ్చారు.
Also Read: “బేబీ” సినిమా గురించి… ఈ నెటిజన్ పోస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
End of Article