Home Filmy Adda “సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” మూవీపై కామెంట్స్..!

“సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” మూవీపై కామెంట్స్..!

by Sainath Gopi

Ads

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.

Video Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.  తాజాగా భోళా శంకర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా, మూవీ చూసినవారు ఇలాంటి సీన్లు పెట్టడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని  అంటున్నారుbholaa shankarఅయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: BHOLAA SHANKAR REVIEW : “చిరంజీవి” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like