Ads
బాలీవుడ్ హీరో అయినా కూడా అక్షయ్ కుమార్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. సినిమా సినిమాకి అక్షయ్ కుమార్ పడే కష్టం, డిఫరెంట్ కాన్సెప్ట్ లని ఎంచుకునే విధానం ఇవన్నీ ఆయనకి ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. కేవలం హీరో పాత్ర అని మాత్రమే కాకుండా, సినిమాలో ముఖ్యమైన పాత్ర ఏదైనా సరే అక్షయ్ కుమార్ చేస్తారు. అలా అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన OMG 2 సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : OMG 2 (ఓ మై గాడ్-2)
- నటీనటులు : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్.
- నిర్మాత : అరుణా భాటియా, విపుల్ డి. షా, రాజేష్ బహల్, అశ్విన్ వర్దే
- దర్శకత్వం : అమిత్ రాయ్
- సంగీతం : విక్రమ్ మాంట్రోస్, హన్స్‌రాజ్ రఘువంశీ, డిజెస్ట్రింగ్స్, ప్రణయ్, సందేశ్ శాండిల్య
- విడుదల తేదీ : ఆగస్ట్ 11, 2023
స్టోరీ :
కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠి) ఒక శివ భక్తుడు. గుడి దగ్గర పూజ సామాగ్రి అమ్మే కొట్టు నడుపుతూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల కాంతి కొడుకు వివేక్ (ఆరుష్ వర్మ) హాస్పిటల్ లో చేరుతాడు. అతను చేసిన ఒక పనికి సంబంధించిన వీడియో స్కూల్ లో లీక్ అవ్వడంతో స్కూల్ నుండి రస్టికేట్ అవుతాడు. అప్పుడు కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది. ఇంక అవన్నీ తట్టుకోలేక కాంతి తన కుటుంబంతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాడు. ఈ ఇబ్బందుల నుండి కాంతి కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు (అక్షయ్ కుమార్) వస్తాడు.
కాంతి కుటుంబానికి ఒక దారి చూపించి, వివేక్ ని మంచి మార్గంలో పెట్టాలి అనుకుంటాడు. కాంతి, ఎవరో వేసిన వలలో తన కొడుకు చిక్కుకున్నాడు అని, తన కొడుకుని ఎవరో తప్పు దోవ పట్టించారు అని అర్థం చేసుకొని స్కూల్ యాజమాన్యం మీద కేసు వేస్తాడు. యాజమాన్యానికి మద్దతుగా లాయర్ కామిని మహేశ్వరి (యామీ గౌతమ్) కేస్ టేక్ అప్ చేసి వాదిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కాంతి తన కొడుకు కోసం ఎలా పోరాడాడు? స్కూల్ యాజమాన్యం చేసిన తప్పు ఏంటి? కాంతి వీటన్నిటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమాకి మొదటి భాగం అయిన ఓ మై గాడ్ చాలా సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాలో కూడా అసలు భక్తి అంటే ఏంటి? భక్తి పేరుతో ప్రజలని చాలా మంది ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని చూపించారు? ఇదే సినిమాని తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఓ మై గాడ్ 2 విడుదల అయ్యింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత నుండి సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలు అయ్యాయి.
అందుకు కారణం ఈ సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్. సాధారణంగా చర్చించుకోవడానికి కూడా ఇబ్బంది పడే ఒక విషయం గురించి ఈ సినిమాలో మాట్లాడారు. దాంతో టీజర్ చూసిన తర్వాత సినిమాని నిలిపివేయాలి అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా గొడవలు అయ్యాయి. సెన్సార్ బోర్డు అయితే ఈ సినిమాకి ఏకంగా 27 సీన్స్ కట్ చేయమని ఆదేశం ఇచ్చింది. అంతే కాకుండా అక్షయ్ కుమార్ పాత్ర తీర్చిదిద్దిన విధానాన్ని కూడా మార్చమని అన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ట్రైలర్ లో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు.
ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే పైన చెప్పినట్టుగానే ఒక సెన్సిబుల్ విషయం గురించి ఈ సినిమాలో మాట్లాడారు. కాంతి కొడుకు వివేక్, తాను చేసిన ఒక పని తనని స్కూల్ నుండి డిస్మిస్ అయ్యేలా చేయడం, తన జీవితం అంతా తలకిందులు అవ్వడంతో డిప్రెషన్ కి లోనయ్యి చనిపోవాలి అనుకోవడం ఇలాంటి విషయాలు అన్నీ ఈ సినిమాలో చూపించారు. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పిల్లల వయసును బట్టి తల్లిదండ్రులు వారితో ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ కూడా ఇందులో చూపించారు.
మనం నిజం అనుకొని నమ్మే చాలా వాటిపై ప్రశ్నలు కూడా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో ఒక ధైర్యం చేశారు. చాలా సున్నితమైన అంశాలని అంతే సున్నితంగా చర్చించారు. చూసే ప్రేక్షకులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో కొంత మంది నటీనటులు మాత్రమే ఉంటారు. కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా కాంతి పాత్రలో చేసిన పంకజ్ త్రిపాఠి సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యారు.
కొడుకు బాధని చూసి తట్టుకోలేని తండ్రిగా, అలానే ధైర్యం తెచ్చుకొని తన కొడుకు కోసం పోరాడే వ్యక్తిగా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలో అంతే బాగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అయితే కంటతడి పెట్టించే లాగా ఉంటాయి. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపిస్తారు. అక్షయ్ కుమార్ అంతకుముందు ఓ మై గాడ్ లో కూడా ఇలాంటి పాత్రే చేశారు. కాంతిని సరైన మార్గంలో నడిపించే దేవుడిగా అక్షయ్ కుమార్ చాలా బాగా నటించారు.
సినిమా మొత్తాన్ని నడిపించారు అని అనొచ్చు. అలాగే లాయర్ కామిని పాత్రలో నటించిన యామీ గౌతమ్ కూడా చాలా హుందాగా ఒక స్ట్రాంగ్ పాత్రలో నటించారు. అయితే సినిమాలో చర్చించిన అంశం సాధారణంగా మాట్లాడుకోవడానికి సుముఖత చూపించే అంశం కాదు కాబట్టి అందరికీ నచ్చే అవకాశం తక్కువ ఉంది. అలా చర్చించుకోవడానికి ఇబ్బంది పడతారు అనే విషయాన్ని సినిమాలో కూడా చెప్పారు. కానీ సినిమా చూసే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనేది చెప్పలేము.
ప్లస్ పాయింట్స్ :
- డిఫరెంట్ కాన్సెప్ట్
- ఆలోచింపచేసే కొన్ని ఎపిసోడ్స్
- నటీనటుల పర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
- అభ్యంతరం కలిగించే అవకాశం ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మరి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కాస్త ఓపెన్ మైండ్ తో ఇలాంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ అయినా సరే చూడగలుగుతాము అనుకుంటే, లేదా అక్షయ్ కుమార్ కోసం సినిమా చూడాలి అనుకున్న వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సమాజానికి సంబంధించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ఒక సినిమాగా OMG 2 సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “జైలర్” సినిమాలో “రజనీకాంత్ కొడుకు” పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా..?
End of Article