Ads
మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీ సింహ. ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నుండి శ్రీ సింహ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ఉస్తాద్
- నటీనటులు : శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా.
- నిర్మాత : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
- దర్శకత్వం : ఫణిదీప్
- సంగీతం : అకీవా బి
- విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2023
స్టోరీ :
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కథ మొదలవుతుంది. సూర్య (శ్రీ సింహ) అక్కడే పుట్టి పెరిగిన ఒక అబ్బాయి. చిన్నప్పుడే సూర్య తండ్రి (వెంకటేష్ మహా) చనిపోవడంతో, తల్లి (అను హాసన్) సూర్యని పెంచుతుంది. అయితే సూర్యకి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం. అంతే కాకుండా కోపం కూడా విపరీతంగా ఉంటుంది. జీవితంలో ఏ విషయం మీద క్లారిటీ ఉండదు. డిగ్రీలో ఉన్నప్పుడు సూర్య ఒక బైక్ కొనుక్కుంటాడు. ఆ బైక్ కి ఉస్తాద్ అని పేరు పెడతాడు.
ఆ తర్వాత మేఘన (కావ్య కళ్యాణ్‌రామ్) తో ప్రేమలో పడతాడు. అయితే సూర్య తర్వాత పైలట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఎత్తైన ప్రదేశాలు అంటే భయం ఉన్న సూర్య పైలట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. సూర్య తన భయాన్ని ఎలా అధిగమించాడు? పైలట్ అయ్యాడా? ఆ తర్వాత సూర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన ప్రేమ కథలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కీరవాణి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ సింహ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన మొదటి సినిమా అయిన మత్తు వదలరా, ఆ తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన భాగ్ సాలే సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇంక ఉస్తాద్ సినిమా విషయానికి వస్తే కథ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అది కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించారు అనంగానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.
సినిమాలో చాలా మంది మంచి యాక్టర్లుగా పేరు పొందిన నటీనటులు ఉన్నారు. అందుకే ప్రతి పాత్ర తెరపై చూపించిన విధానం బాగుంది. హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీ సింహ, కావ్య కూడా బాగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క యాక్టర్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. అలాగే పవన్ కుమార్ పప్పుల అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ కథని తెరపై చూపించే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.
చిన్న పాయింట్ ని చాలా ఎక్కువ సేపు చూపించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అసలు ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటో పోతుంది ఏమో అనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ కి మధ్య వచ్చే డైలాగ్స్, కామెడీ బాగానే ఉన్నాయి. అంత మంచి ఎమోషన్స్ ఉన్న స్టోరీ సినిమా ల్యాగ్ కారణంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- సినిమాటోగ్రఫీ
- నటీనటులు
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- సినిమా నిడివి
- సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చూపించడంలో విఫలం అయ్యారు ఏమో అనిపిస్తుంది. ఇంత సాగదీయకుండా ఉన్నట్టు అయితే సినిమా ఫలితం వేరేగా ఉండేది ఏమో. ఇప్పుడు అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఉస్తాద్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” మూవీపై కామెంట్స్..!
End of Article