Ads
తిరుమలకు వెళ్ళే నడకదారిలో చిరుత పులి దాడిలో లక్షిత అనే పాప ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందరినీ ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసింది. చనిపోయిన లక్షిత మృత దేహానికి పోస్టుమార్టం జరిపించారు. దీనిలో లక్షిత చనిపోవడానికి కారణం చిరుత పులి అని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.
Video Advertisement
పోస్టుమార్టం పూర్తి అయిన తరువాత లక్షిత మృతదేహాన్ని రుయా మార్చురీ నుండి నెల్లూరుకు తరలించారు. లక్షిత మరణించడంతో ఇటు ఆమె కుటుంబంలో, అటు ఆమె గ్రామం అంత విషాదంలో మునిగింది. రుయా హాస్పటల్ లక్షిత కుటుంబ సభ్యుల రోధనతో నిండిపోయింది. తిరుమలలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరు సంవత్సరాల లక్షిత ఫ్యామిలీకి టీటీడీ ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నారు. టీటీడీ తరపున ఐదు లక్షలు ఇవ్వనుండగా, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఐదు లక్షలు ఇవ్వనుంది. మొత్తం కలిపి పది లక్షల ఎక్స్‌గ్రేషియాను లక్షిత కుటుంబానికి అంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి లక్షిత ఇన్సిడెంట్ పై స్పందించడం కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ, చిరుత పులి దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన, విషాదకరమైన ఘటన అని తెలిపారు. లక్షిత నడకదారిలో తన తల్లిదండ్రులతో కాకుండా పలుమార్లు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో నడకదారిలో పటిష్టమైన చర్యలు మరింతగా తీసుకుంటామని, త్వరలో 500 సీసీ కెమరాలను ఏర్పాటు చేసి అడివిమృగాలు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు.
గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను మరింతగా పెంచుతామని, 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున నియమిస్తామని వెల్లడించారు. నడకదారిలో చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిలల్లను వారి సంరక్షణలో ఉంచుకోవాలని సూచించారు, హై అలర్ట్ ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేస్తామని, రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం నడకదారిలో తిరుమల వచ్చే భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అనుమతించే టైమ్ ను తగ్గించేందుకు ఆలోచిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ ప్రధాని “మన్మోహన్ సింగ్”..! ఇలా అయిపోయారేంటి..?
End of Article