తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?

తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?

by kavitha

Ads

ఇటీవల తిరుమల నడకదారిలో చిన్నారి లక్షత పై చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిన్నారి మృతి నేపథ్యంలో అటవీ అధికారులు నడక దారిలో, చుట్టూ పక్కల చిరుతను పట్టుకోవడం కోసం బోన్లు మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Video Advertisement

ఆదివారం రాత్రి సమయంలో చిన్నారి పై దాడి జరిగిన ప్రాంతంలోనే ఒక చిరుత బోనులో చిక్కింది. ఈ చిరుతను  ఫారెస్ట్‌ ఆఫీసర్లు ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. అయితే చిన్నారీ పై దాడి చేసింది. బోనులో చిక్కిన చిరుతేనా? కాదా? అనే విషయం గురించి అధికారులు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
టీటీడీఎఫ్ఓ శ్రీనివాసులు బీబీసి న్యూస్ తో మాట్లాడుతూ చిన్నారి పై దాడి చేసిన చిరుత, బోనులో చిక్కిన చిరుత ఒక్కటేనా కాదా  అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుత పులి కడుపులో మానవ మాంసమకు చెందిన  ఆనవాళ్లు ఉన్నాయో? లేదా అనే దానిని తెలుసుకుంటాం. నిపుణులు చిన్నారి పై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అని నిజ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఫారెస్ట్‌ ఆఫీసర్ల నిర్ణయం మేరకు బోనులో చిక్కిన చిరుతను జూలోనే ఉంచాలా? లేదా అడవిలో వదలాల అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
ఇక బోనులో చిక్కిన చిరుతపులి ఆడ చిరుత అని, దానికి  నాలుగు ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడుతూ చిన్నారి మరణించిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇంకా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని, చిరుతలను పట్టుకునే ప్రక్రియ  కొనసాగుతుంది.
తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అటవీ శాఖ అధికారులు చెప్పేదాకా నిబంధనలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాకుండా నడకదారిలో వచ్చే 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల అనంతరం అనుమతించమని చెప్పారు. ఇక నడకమార్గంలో వచ్చే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ధర్మారెడ్డి సూచించారు.

Also Read: చిరుత దాడికి గురైన అమ్మాయి కోసం TTD కీలక నిర్ణయం..! అసలు విషయం ఏంటంటే..?

 


End of Article

You may also like