MR. PREGNANT REVIEW : “సోహెల్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

MR. PREGNANT REVIEW : “సోహెల్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు సోహెల్. సోహెల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. అంతకుముందు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో కూడా సోహెల్ హీరోగా నటించారు. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

Video Advertisement

  • చిత్రం : మిస్టర్ ప్రెగ్నెంట్
  • నటీనటులు : సయ్యద్ సోహెల్, రూప కొడువాయూర్, సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, అలీ, బ్రహ్మాజీ.
  • నిర్మాత : అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
  • దర్శకత్వం : శ్రీనివాస్ వింజనంపాటి
  • సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
  • విడుదల తేదీ : ఆగస్ట్ 18, 2023

mr pregnant movie review

స్టోరీ :

గౌతమ్ (సయ్యద్ సోహెల్) ఒక టాటూ ఆర్టిస్ట్. మహి (రూప కొడువాయూర్) గౌతమ్ ని విపరీతంగా ఇష్టపడుతుంది. మహిని అస్సలు ఇష్టపడని గౌతమ్ ఒక రోజు పార్టీలో తాగిన మత్తులో తనకి పిల్లలు వద్దు అని, పిల్లల్ని కనకుండా ఉంటే తన ప్రేమని అంగీకరిస్తాను అని చెప్తాడు. మహి ఈ విషయాన్ని అర్థం చేసుకొని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళుతుంది.

mr pregnant movie review

ఇది తెలుసుకున్న గౌతమ్, మహికి తనంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని అర్థం చేసుకొని మహి ప్రేమని అంగీకరిస్తాడు. వారిద్దరి పెళ్లి తర్వాత అనుకోని కారణాల వల్ల గౌతమ్ ప్రెగ్నెంట్ అవుతాడు. అసలు మగవాడు ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడు? గౌతమ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? తర్వాత ఏం జరిగింది? మహి ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా పేరు నుండి, ట్రైలర్ వరకు అన్ని చాలా కొత్తగా అనిపించాయి. అసలు ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనే విషయమే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ చూశాక ప్రేక్షకులకి ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇంకా కథ విషయానికి వస్తే స్టోరీ లైన్ అంతా కూడా మనకి ట్రైలర్ లోనే అర్థం అయిపోతుంది. ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అవ్వడం. కానీ అసలు ఆ అవ్వడం వెనుక ఉన్న కథని ఎలా చూపించారు అనేది ముఖ్యమైన విషయం.

mr pregnant movie review

సినిమా ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కథ ఉండదు. హీరో టాటూ ఆర్టిస్ట్. హీరోయిన్ అతని వెనకాల పడడం. చాలా వరకు ఇదే నడుస్తుంది. అసలు హీరోయిన్ హీరో వెనకాల అంతగా ఎందుకు పడుతుంది? హీరోని అంతగా ఎందుకు ప్రేమిస్తుంది? అనే విషయాలని మాత్రం ఇంకా క్లియర్ గా చూపించి ఉంటే బాగుండేది. హీరో ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుండి సినిమా కాస్త ఫాస్ట్ గా నడుస్తూ ఉంటుంది. ఎమోషన్స్ కూడా చూపించడానికి ప్రయత్నించారు. అవి చాలా వరకు వర్క్ అవుట్ కూడా అయ్యాయి.

mr pregnant movie review

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో సోహెల్ టాటూ ఆర్టిస్ట్ పాత్ర పోషించినప్పుడు కాస్త ఓవర్ టాప్ నటించినా కూడా, సినిమా ముందుకు వెళ్లే కొద్దీ, అందులోనూ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో అయితే సోహెల్ నటన కంటతడి పెట్టిస్తుంది. హీరోయిన్ రూప కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలో బాగా నటించారు.

mr pregnant movie review

డాక్టర్ వసుధ పాత్రలో నటించిన సుహాసిని సినిమాకి మరొక హైలైట్ అయ్యారు. ఇంక మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన వైవా హర్ష, స్వప్నిక, బ్రహ్మాజీ వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు బాగున్నాయి. నిజార్ షఫీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరొక రేంజ్ లో ఉండేది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • పాటలు
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
  • నవ్వు రాని కొన్ని కామెడీ ఎపిసోడ్స్

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో ఉన్న చిన్న చిన్న లోపాలని పక్కన పెట్టి, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారికి ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఒక సెన్సిబుల్ విషయాన్ని అంతే సెన్సిబుల్ గా తెరపై చూపించి సినిమా బృందం చాలా మంచి ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో ఒకటిగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : గుర్తింపు కోసం చట్టంపై పోరాటం..! ఈ వ్యక్తి కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు..!


End of Article

You may also like