Ads
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడ వస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తులలో కొందరు నడక దారిలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే ఇటీవల అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే నడక దారిలో చిరుత దాడి చేసిన ఘటన గురించి తెలిసిందే. ఇది రెండవ ఘటన. జూన్ నెలలో చిరుత దాడిలో ఒక బాలుడు గాయపడగా, రీసెంట్ గా జరిగిన చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
చిరుత దాడిలో చిన్నారి చనిపోవడం ఇటు ప్రజల్లో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు, లేదా ఇతర క్రూరమృగాలు ఎందుకు వస్తున్నాయనే అంశం తెరపైకి వచ్చింది. బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ ఈ విషయం పై మాట్లాడారు. తిరుమల మెట్ల మార్గంలోకి చిరుతలు తరచూ రావడానికి చాలా కారణాలున్నాయని అన్నారు. వాటిలో ఒకటి అకేసియా వృక్షాలు.
తిరుమల కొండల పై అకేసియా చెట్లు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చిందని భూమన్ తెలిపారు. గంటా మండపం, నామాల గవి వద్ద 225 ఎకరాలు ఉండేదని, అక్కడ 1985లో చెట్లు లేవని, టీటీడీ అకేసియా చెట్లను అక్కడ నాటింది. ఈ చెట్ల కారణంగా అక్కడ పెరిగే ఈత, శ్రీగంధం వంటి మిగతా చెట్లు ఎదగవని, ఇతర మొక్కలు కూడా బతకవని చెప్పారు. చెట్లు పెరిగినప్పటికీ, వాటికి కాయలు కాయకపోవడంతో అక్కడ ఆహారం లభించక ఇతర జంతువులు వెళ్లిపోయాయని అన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.
అయితే రీసెంట్ గా సుమారు ముప్పై ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను కొట్టేశారు. అప్పటి దాకా ఆ చెట్ల నీడలో ఉండే చిరుతలు మనుషులకు సమీపంలో వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని భూమన్ చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడుతూ అకేసియా చెట్లను కొట్టేసింది నిజమేనని, అయితే వాటిని కొట్టేయడం కారణంగా చిరుత పులులు నడకదారి వైపు వస్తున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు.
Also Read: తిరుమలలో పిల్లలపై దాడి చేసిన చిరుతపులి ఇదేనా..? ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే..?
End of Article