Ads
మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీ ఉన్న సినిమాలని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరుణ్ తేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : గాండీవధారి అర్జున
- నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్.
- నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
- దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
- సంగీతం : మిక్కీ జె మేయర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023
స్టోరీ :
ఆదిత్య రాజ్ (నాజర్) ఒక సెంట్రల్ మినిస్టర్. ఆదిత్య రాజ్ కి ప్రాణాపాయం ఉంటుంది. యుఎన్ లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాలి. అందుకే అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ని ఆయనకి సెక్యూరిటీగా నియమిస్తారు. అసలు ఆదిత్య రాజ్ ని ఎవరు చంపాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అప్పుడు అర్జున్ ఏం చేశాడు? ఆదిత్య రాజ్ ని ఎలా కాపాడాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా యాక్షన్ సినిమాలు అంటేనే ప్రేక్షకులకి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా చూపిస్తారు? ఎలా డిజైన్ చేస్తారు? అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాల్లో కాస్త పొరపాటు జరిగినా కూడా ఆ యాక్షన్ సీన్స్ ట్రోల్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఒక పక్క లాజిక్ మేనేజ్ చేస్తూనే, ఒక పక్క హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండేలాగా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇంక ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ అంతా ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. సినిమా బ్యాక్ డ్రాప్ బాగున్నా స్టోరీ మాత్రం తెలిసిపోయే కథ లాగానే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సినిమాలు సెకండ్ హాఫ్ లో అయినా కాస్త గ్రిప్పింగ్ గా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ సినిమాలో అది కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఎంత డల్ గా అయితే ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న తీరు బాగుంది.
ఒక మంచి యాక్షన్ సినిమాకి ఒక హీరో ఎలా అయితే ఉండాలో వరుణ్ తేజ్ అలాగే ఉన్నారు. పాత్రలో తన నటన కూడా బాగుంది. సినిమాలు ఎలా ఉంటున్నా కానీ వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి పడే కష్టం తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అలా పాత్ర కోసం తనని తాను మార్చుకున్నారు. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. కానీ ఎవరి పాత్ర కూడా కంప్లీట్ గా అనిపించదు. చాలా సంవత్సరాల క్రితం హీరోయిన్ గా నటించిన విమలా రామన్ కూడా ఈ సినిమాలో నటించారు.
కానీ తనకి కూడా మంచి పాత్ర రాలేదు. డాక్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన హీరో వినయ్ రాయ్ ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి పాత్రలోనే నటించారు. అందుకే కొత్తదనం అనిపించదు. హీరోయిన్స్ సాక్షి వైద్య అయితే సినిమా మొత్తం ఉంటారులే కానీ నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు. తెరపై వరుణ్ తేజ్ పక్కన సాక్షి వైద్య పెయిర్ బాగుంది. పాటలు కూడా అంత పెద్ద గొప్పగా ఏమీ లేవు. సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఆ సీన్స్ ఇంకా కొంచెం అయినా ఎలివేట్ అయ్యేవి ఏమో.
సినిమాలో గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా మెసేజ్ చెప్పాలి అని ప్రయత్నించారు. ఇలా చెప్పాలి అనుకోవడం మంచి విషయం అయినా కూడా అది ప్రాపర్ గా ప్రేక్షకులకు అందలేదు. ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా నిర్మాణ విలువల పరంగా చాలా బాగుంది. లొకేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. కానీ అవి ఏమీ కూడా సినిమాకి సహాయపడలేకపోయాయి. కథపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా బాగుండేది ఏమో.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ప్రేక్షకులకి బోరింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా దాన్ని తెరపై చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. యాక్షన్ మీద చాలా సినిమాలు వచ్చి అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాల్లో ఒకటిగా గాండీవధారి అర్జున సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article