కొత్త “ఎడ్యుకేషన్ పాలసీ” లో ఏం ఉంది..? దీని వల్ల విద్యా విధానంలో వచ్చే మార్పులు ఏంటంటే..?

కొత్త “ఎడ్యుకేషన్ పాలసీ” లో ఏం ఉంది..? దీని వల్ల విద్యా విధానంలో వచ్చే మార్పులు ఏంటంటే..?

by kavitha

Ads

జాతీయ విద్యా విధానంలో సంచలనమైన మార్పులు తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంను తీసుకొచ్చింది. దానిలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ని కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఉన్నత విద్యలో కీలక సంస్కరణలను చేసింది.

Video Advertisement

విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020 కి మూడు ఏళ్లు పూర్తయ్యాయి. జాతీయ విద్యా విధానం వల్ల వచ్చే మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020 ప్రకారం, 3 – 18 సంవత్సరాల వరకు అందరికీ చదువు తప్పనిసరి చేసింది. 2030 వరకు అందరికీ విద్య అందించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. 5వ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలను బోధిస్తారు. ఆరవ తరగతి నుండి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ ఉండేలా చర్యలు. అలాగే 6వ తరగతి నుండే వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు అమలులోకి వస్తాయి. ఎంఫిల్ కోర్సును పూర్తిగా తొలిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విధానం, ఇక పై 5+3+3+4 విధానంలోకి మారనుంది. డిగ్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు.
పీజీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు. ఇంటర్ చదువు ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు యూజీ ఐదు సంవత్సరాలు. దేశం మొత్తం ప్రాథమిక చదువుకు ఒకటే కరిక్యులమ్ ఉండనుంది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి,  కాన్సెప్ట్ ను విధ్యార్ధులకు నేర్పే ప్రయత్నం దిశగా మారనుంది. ఇక పై కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ పన్నెండవ తరగతి వరకు మాత్రమే.
టీచింగ్ ఇంటెన్సివ్ లేదా రీసెర్చ్ ఇంటెన్సివ్  యూనివర్సిటీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలను ఆమోదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో నాలుగు ఏళ్ల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఈ డిగ్రీలో వృత్తిపరమైన రంగాలకు చెంది ఉంటాయి. 1 ఏడాది రీసెర్చ్ పూర్తి అయ్యాక  ఒక సర్టిఫికేట్, రెండు ఏళ్ల చదువు పూర్తి అయ్యాక  డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ళ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్ళ మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయ్యాక సర్టిఫికెట్ లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

watch video:

Also Read: చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడం వల్ల భారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో తెలుసా..?


End of Article

You may also like