Ads
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ చూసి నార్త్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ స్టైల్ టేకింగ్, ఎమోషన్స్, ఎలివేషన్స్ కు బాలీవుడ్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు.
Video Advertisement
గత 4 ఏళ్లుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమయిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాది తన సత్తా చాటుతున్నాడు. ఏడాది మొదట్లో రిలీజ్ అయిన ‘పఠాన్’ మూవీతో వెయ్యి కోట్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు జవాన్ తో తొలిరోజు సూపర్ హిట్ టాక్ తో పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను బీట్ చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో జవాన్ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిరోజు హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన మూవీ జవాన్. ఈ చిత్రంలో విజయయ సేతుపతి, దీపికా పదుకొనే, అతిథి పాత్రలో సంజయ్ దత్ నటించారు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించిన జవాన్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్‌గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్‌ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్‌లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: మూడు పదుల వయస్సు దాటినా, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని 8 స్టార్ హీరోయిన్లు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!
End of Article