Ads
రెండు దశాబ్దల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతానికి కూడా టాప్ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తోంది త్రిష. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో హీరోయిన్‌గా చేసిన త్రిష.. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు.
Video Advertisement
ఎందుకంటే మొదటి సినిమాతో నుంచి ఇప్పటి వరకు హిట్ మీద హిట్ కొడుతూనే ఉంది. నాలుగు పదుల వయస్సు దాటినా తన అందం, యాక్టింగ్‌తో అందరికి ఆకర్షిస్తుంది.
వయస్సు పెరిగేకొద్ది అందంతో పాటు హీరోయిన్లకు వచ్చే ఆఫర్స్ కూడా తగ్గిపోతాయి. కానీ త్రిష మాత్రం వయస్సు పెరిగేకొద్ది అందంతో పాటు సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. అందులోనూ నాలుగు సినిమాలు స్టార్ హీరోలవే. అందులో ఒకటి దసరాకు రిలీజ్ కాబోతున్న ‘లియో’. ఇందులో విజయ్‌కు జోడీగా నటిస్తోంది. అలాగే అజిత్ హీరోగా నటించనున్న ‘విదామువర్చి’ సినిమాలో కూడా హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది.
వీటితో పాటు కమల్-మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా త్రిష హీరోయిన్. అలాగే చీరంజీవి సినిమాలో కూడా హీరోయిన్ త్రిష అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. 25ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా కూడా ఉంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరు సినిమా చూసిన సెల్వా రాఘవన్.. పదేళ్ల కిందట ఈ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. మళ్లీ అవకాశమొస్తే వెంకటేష్, త్రిషతో ఓ సినిమా చేయాలనుకుంటున్నానని 2013లో చేసిన ట్వీట్‌కి ఇప్పుడు నేను రెడీ అంటూ త్రిష రిప్లై ఇచ్చింది.
End of Article