Ads
యాంకర్ సుమ గురించి తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై సుమ చేసే సందడే వేరుగా ఉంటుంది. పంచులతో, చలాకీతనంతో ఆడియెన్స్ ఆకట్టుకోవడమే కాకుండా నవ్విస్తూ ఉంటుంది.
Video Advertisement
ఏ షో అయినా సరే ఆడియెన్స్ కు బోర్ కలగకుండా తన మాటలతో నడిపించగల సత్తా సుమ సొంతం. బుల్లితెర షోలతో, ప్రీరిలీజ్ వేడుకలు, సక్సెస్ మీట్స్ తో బిజీ బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సుమ తన పెళ్లి కార్డ్ ను షేర్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాంకర్ సుమ తెలుగులో టాప్ మరియు స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ చాలా బిజీగా ఉండే, అత్యంత కాస్ట్లీ మరియు టాలెంటెడ్ యాంకర్. యాంకర్ లలో ఎక్కువగా సంపాదిస్తున్న యాంకర్ కూడా సుమనే అని చెప్పవచ్చు. ఒక వైపు షోస్, మూవీ ఈవెంట్స్ చేస్తూ, మరోవైపు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే, సుమ, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి, 24 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సుమ కెరీర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ లో, సినిమాలలో నటించింది. ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ క్రమంలోనే సుమ దేవదాస్ కనకాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం, అది కాస్త ప్రేమ, ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లింది. వీరి పెళ్లి 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. ఈ జంటకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సుమ తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పెళ్లి కార్డ్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ కి ” మీరు కార్డు చదివారా?
1999లోనే యునిక్ వేలో వెడ్డింగ్ కార్డ్” అంటూ రాసుకొచ్చారు.
https://www.instagram.com/p/CxZYqv9xwKg/
Also Read: థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జవాన్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
End of Article