Ads
తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్ళ నుండి పోరాడి, ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ తొమ్మిదేళ్ల నుండి అన్ని రకాలుగా అభివృద్ది దిశగా సాగుతోంది.
Video Advertisement
అయితే తెలంగాణలోని ఒక విద్యార్ధిని రాష్ట్ర విభజన వల్ల ఎంబీబీఎస్ సీటును కోల్పోయింది. కుమార్తె డాక్టర్ అవుతుందని కలలు కన్న ఆమె తండ్రి, ఉన్నత చదువులకు దూరం కావడంతో సెల్ఫీ వీడియోలో విషయం చెప్తూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండల కేంద్రంలో రీసెంట్ గా ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి తండ్రి సెల్ఫీ వీడియోలో వివరాలు వెల్లడించారు. అశ్వరావుపేటలో నివసిస్తున్న కీర్తన ఒకటవ క్లాస్ నుంచి ఐదవ క్లాస్ వరకు అశ్వరావుపేటలోని స్కూల్ లో చదువుకుంది. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి ఖమ్మం జిల్లాలోని ఎటపాక నవోదయ స్కూల్ లో సీట్ రావడంతో ఆరు నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివింది. ఇంటర్ కరీంనగర్ గురుకుల కళాశాలలో పూర్తి చేసింది.
రీసెంట్ గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 362 మార్కులను సాధించింది. వారిది ఎస్సీ కేటగిరి అవడంతో ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుందని ఫ్యామిలీ అంత సంతోషాపడ్డారు. కానీ ఆరవ తరగతిలో కీర్తన చేరిన ఏడాదికి ఎటపాక నవోదయ విద్యాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయింది. దాంతో కీర్తన ఆంధ్రప్రదేశ్ కు లోకల్ గా, తెలంగాణకు నాన్ లోకల్ గా మారింది. దానివల్ల కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఆమె ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది.
కీర్తన తండ్రి సూర్య తమ పూర్వీకుల నుండి తెలంగాణలో ఉంటున్నామని అన్నారు. ధ్రువపత్రాలన్ని కలిగి ఉన్నామని తన కుమార్తెను నాన్ లోకల్ గా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అని, తన కుమార్తె కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా సీటు వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళగా కీర్తనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీలో కోర్టు ఆర్డర్ తో సంప్రదించగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయని, కీర్తనను నాన్ లోకల్ గా లెక్కిస్తామని చెప్పారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థుల పేరంట్స్ స్థానికత అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ, ఆ యూనివర్సిటీ దానిని పరిగణలోకి తీసుకోలేదని, దానివల్ల విద్యార్థిని ఉన్నత చదువుకు దూరమయ్యే కండిషన్ ఏర్పడింది. ఈ విషయం పై తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలని కీర్తన పేరెంట్స్ కోరుతున్నారు.
Also Read: ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఖైదీలుగా వెళ్లిన ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
End of Article