Ads
జ్యోతిరాయ్ ‘జగతి మేడమ్’ గా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ మనసులలో స్థానం సంపాదించుకున్నారు. బుల్లితెర పై పాపులర్ సీరియల్‌గా పేరుగాంచిన ‘గుప్పెడంత మనసు‘ సీరియల్ తో తెలుగువారికి జగతిగా దగ్గరయ్యింది జ్యోతిరాయ్.
Video Advertisement
ఈ సీరియల్ లో హీరో రిషికి తల్లిగా జగతి మేడమ్ క్యారెక్టర్ లో జ్యోతిరాయ్ సంప్రదాయమైన చీరకట్టు, బొట్టుతో, సహజమైన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. అయితే ఆమె పై కొద్ది రోజులుగా డైరెక్టర్ తో ప్రేమ అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఆ విషయం గురించి పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అయితే జగతి క్యారెక్టర్ లో చాలా పద్ధతిగా, హుందాగా కనిపించే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో చిన్న చిన్న డ్రెస్సులతో ఓ రేంజ్ రచ్చ చేస్తోంది. జ్యోతి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసినవారు అసలు ఇన్ స్టాలో ఫోటోలకు, జగతి మేడంకు పోలికలు ఏమైనా ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు.
అయితే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని రీసెంట్ గా బయటపెట్టింది. ది ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఆ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి, నెట్టింట్లో వైరలయ్యింది. ఇదిలా ఉంటే, కొంతకాలంగా జ్యోతిరాయ్ పర్సనల్ విషయాలపై రక రకాల వార్తలు వచ్చాయి. 20 ఏళ్ళ వయసులోనే జ్యోతిరాయ్ కి పెళ్లి అయ్యి, ఒక బాబు ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు డైవర్స్ ఇచ్చింది.
ఆమె ఒక యువ దర్శకుడితో ప్రేమలో ఉందనే వార్తలు వినిపించాయి. తాజాగా తన పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆ దర్శకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ రింగ్ ఉన్న ఎమోజిని షేర్ చేశారు. ఇలా షేర్ చేయడంతో తమ రిలేషన్ అఫిషియల్ గా ప్రకటించారని తెలుస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు వీరి ఎంగేజ్మెంట్ జరిగిందా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
https://www.instagram.com/p/CxxbJHnoTMp/
End of Article