“ప్రభాస్ చెంప పగలగొట్టింది..!” అన్నారు..! ఎవరు ఈ అమ్మాయి… అసలు జరిగింది ఏంటి అంటే..?

“ప్రభాస్ చెంప పగలగొట్టింది..!” అన్నారు..! ఎవరు ఈ అమ్మాయి… అసలు జరిగింది ఏంటి అంటే..?

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సొంతం చేసుకుని, వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.

Video Advertisement

ప్రభాస్ కున్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ కనిపించగానే సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడుతుంటారు. అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఒక లేడీ ఫ్యాన్ ప్రభాస్ చెంప పై కొట్టిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. రిలీజ్ కు రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ ఈ మూవీ గురించి ఇప్పటి నుండే చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సలార్, షారుక్ ఖాన్ డుంకీ సినిమాల మధ్య  క్లాష్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అభిమానుల మధ్య అప్పుడే  ట్రోలింగ్ వార్ మొదలైంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళా అభిమాని ప్రభాస్ చెంప పై కొట్టినట్టుగా కనిపిస్తోంది.
వీడియోలో ప్రభాస్‌ను చూసి సెల్ఫీ దిగడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్న మహిళా అభిమాని ప్రభాస్ తో సెల్ఫీ తీసుకున్న తరువాత ప్రభాస్ ముఖం పై ఆ అభిమాని అత్యుత్సాహంతో టచ్ చేసింది, కొట్టలేదు. ఈ వీడియో నిజానికి 2019లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&ig_rid=773ec599-4422-4917-9bac-c9928c95171f

Also Read: “అమృతం” సీరియల్ లో అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు జరిగింది కదా..? విషయం ఏంటంటే..?


End of Article

You may also like