ఇజ్రాయిల్ లో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏంటి..? అక్కడ మొత్తం ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటే..?

ఇజ్రాయిల్ లో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏంటి..? అక్కడ మొత్తం ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటే..?

by kavitha

Ads

ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపు దాల్చుతోంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. శనివారం ఉదయం ఇజ్రాయెల్‌ పై హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం అధికంగా దెబ్బతింది.

Video Advertisement

దాంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో భారీగా మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. అయితే దక్షిణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇండియన్స్ నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ లో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏమిటో? మొత్తం ఎంతమంది భారతీయులు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం ఉదయం ఇజ్రాయెల్‌ పై వేలాది రాకెట్లతోదాడి చేశారు. ఇజ్రాయెల్ సౌత్ ప్రాంతం ఈ దాడిలో ఎక్కువగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇండియన్స్, ఇండియా మూలాలు కలిగిన  ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో కొందరు కిడ్నాప్ కు గురయ్యారని, కొందరు చనిపోయినట్లుగా పలు రిపోర్ట్ లు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన యూదులు సుమారు 95,000 మంది, భారతీయులు 18,000 మంది నివసిస్తున్నారని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ కొందరు భారతీయులు పెద్దగా ఆందోళన పడడం లేదు. సెక్యూరిటీకి సంబంధించిన సూచనలను పాటించినట్లయితే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దాడి ఎక్కువగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోనే జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో అంతగా దాడులు జరగట్లేదు. అందువల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటే దాడుల వల్ల కలిగే ప్రమాదం తక్కువ అని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
రాకెట్లు ఎక్కువగా అష్కెలోన్ సిటీలోనే పడ్డాయి. ఇక ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణకు చెందిన ఎల్లే ప్రసాద్ ”చాలా అలర్ట్ గా ఉండాలి, సైరన్ మోగిన వెంటనే షెల్టర్‌కు వెళ్ళాలి” అని అన్నారు. హిబ్రూ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ స్టూడెంట్ బిందు మాట్లాడుతూ సేఫ్టీ ప్రోటోకాల్‌లను ఫాలో అయ్యానని, సురక్షితంగా ఉన్నానని వెల్లడించారు. అలాగే  ఇండియన్ స్టూడెంట్స్ అందరూ పరస్పరం టచ్‌లోనే ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని  తెలిపారు.

 

 

 


End of Article

You may also like