Ads
భారతదేశంలో ఉన్న ప్రముఖ బ్యాంకుల్లో HDFC బ్యాంక్ ఒకటి. ఇప్పుడు ఈ బ్యాంకు రూపొందించిన ఒక యాడ్ వివాదం రేపుతుంది. విజిల్ ఆంటీ పేరుతో HDFC రిలీజ్ చేసిన యాంటీ హిందూ ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Video Advertisement
ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC తన ప్రకటనలో విజిల్ ఆంటీ అని పిలవబడి ఒక మహిళ తన నుదుటి పై స్టాప్ సైన్ వంటి బిందీనీ కలిగి ఉంది.ఈ ప్రకటనను హిందూ వ్యతిరేకంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో (x) నెటిజన్లు ఈ ప్రకటనపై HDFC బ్యాంక్ ను ట్యాగ్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఎవరికి వచ్చిన విధంగా వారు కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు.
మహిళ నుదుటిపై గుర్తు పెట్టుకుని మీరు హిందూ సాంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా? సాంస్కృతికంగా మీరు ఎంత గుడ్డివారు. మీరు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద బ్యాంక్, అలాగే భారతదేశానికి సరిగ్గా ప్రాతినిధ్యం వహించే పెద్ద బాధ్యతలు మీరు కలిగి ఉన్నారు. ఇలాంటి ప్రకటనలు ఉపసంహరించుకోండి అంటూ క్రియేలి మీడియా రాసింది.
ఓ వినియోగదారుడు అయితే “HDFC బిందీని ఎగతాళి చేస్తుంది. దేవునికి ధన్యవాదాలు నాకు HDFC బ్యాంకులో ఖాతా లేదు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ కేర్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తాయి అంటూ ఒక వినియోగదారుడు పోస్ట్ చేశాడు.
ఇలాగే గతవారం మేక్ మై ట్రిప్ వరల్డ్ కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించి విమర్శలు పాలైంది.సోషల్ మీడియా అంతా యాంటీ హిందూ HDFC బ్యాంక్ తో ట్రెండ్ అవుతుంది. HDFC బ్యాంకు దీనికి సమాధానం చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:ఈ మహిళకి చెప్పుల దండ వేసి ఎందుకు ఊరేగించారు..? అసలు ఏం జరిగిందంటే..?
End of Article