Ads
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు రీసెంట్ గా రిలీజ్ అయింది. బుక్ మై షో లో పెద్దగా జోరు చూపించకపోయిన ఆఫ్ లైన్ లో థియేటర్ కౌంటర్ దగ్గర టికెట్ సేల్ పరంగా మంచి జోరు చూపెడుతూ దూసుకుపోతుంది. రవితేజ ముందు సినిమా రావణాసురతో పోలిస్తే టైగర్ నాగేశ్వరరావు బుకింగ్స్ బాగున్నాయి.
Video Advertisement
చాలా చోట్ల మాస్ మహారాజా రాంపేజ్ ను చూపిస్తుంది. కొన్నిచోట్ల మంచి టాక్ రాబట్టుకుని హౌస్ ఫుల్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. అయితే సినిమా లెంత్ ఎక్కువ ఉందని కంప్లైంట్ బాగా వినిపిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.5 నుండి 5 కోట్ల దాకా షేర్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్లను ట్రేస్ చేయలేము కాబట్టి ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని సినిమా నిపుణులు చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ 6- 6.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకోవచ్చు. బాలకృష్ణ భగవంత్ కేసరి తమిళ్ హీరో విజయ్ నియో సినిమాలతో పోలిస్తే రవితేజ టైగర్ నాగేశ్వరరావు తక్కువ ధియేటర్లో రిలీజ్ అయింది.
తక్కువ థియేటర్లో అయినా కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే ఆ సినిమాలకు మించి ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తుంది.రవితేజ కొన్ని క్రేజ్ బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈజీగానే జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఏది ఏమైనా రవితేజ కొత్తగా ట్రై చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా మంచి ఫలితాన్ని రాబట్టుకుంటుంది.
Also Read:మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిన లియో సినిమా..!
End of Article