డిజాస్టర్ అనేది కూడా చాలా చిన్న పదం ఏమో..? ఈ సినిమా చూశారా..?

డిజాస్టర్ అనేది కూడా చాలా చిన్న పదం ఏమో..? ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

ఈ మధ్య ప్రతి సినిమా అన్ని భాషల్లో విడుదల అవ్వడం అనేది ట్రెండ్ అయిపోయింది. సినిమాలో యూనివర్సల్ గా సూట్ అయ్యే కంటెంట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ప్రతి సినిమాని మాత్రం అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా బాలీవుడ్ లో రూపొందిన గణపథ్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : గణపథ్
  • నటీనటులు : టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్.
  • నిర్మాత : వాషు భగ్నాని, వికాస్ బహ్ల్, దీప్శిఖా దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని
  • దర్శకత్వం : వికాస్ బహ్ల్
  • సంగీతం : విశాల్ మిశ్రా, అమిత్ త్రివేది, వైట్ నాయిస్ స్టూడియోస్, డా.జియస్
  • విడుదల తేదీ : అక్టోబర్ 20, 2023

ganapath movie review

స్టోరీ :

కథ 2060 సంవత్సరంలో మొదలవుతుంది. అప్పటికి ప్రపంచం రెండుగా విడిపోయి ఉంటుంది. ఒకటి సిల్వర్ సిటీ. అందులో ధనవంతులు ఉంటారు. ఇక్కడ మనుషులకంటే ఎక్కువగా రోబోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డ్రోన్లు కూడా తిరుగుతూ ఉంటాయి. మరొకటి గరీబోన్ కి బస్తి. అంటే పేదవాళ్లు ఉండే బస్తి అన్నమాట. ఇక్కడ డబ్బులు లేని పేదవాళ్లు ఉంటూ ఉంటారు. వీళ్ళని కాపాడడానికి గణపథ్ వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు.

ganapath movie review

ఇదంతా దళపతి (అమితాబ్ బచ్చన్) కి ముందే తెలుసు. అలా వీరిని కాపాడడానికి పుట్టిన వ్యక్తి గుడ్డు (టైగర్ ష్రాఫ్). గుడ్డు ఒక బాక్సర్. కానీ సిల్వర్ సిటీ అంటే ఇతనికి ఆసక్తి ఎక్కువ. ఆడవాళ్ళ వెనకాల కూడా పడుతూ ఉంటాడు. ఇంకొకపక్క జెస్సి (కృతి సనన్) ఒక ఎడారి లాంటి చోటులో ఉంటుంది. అలాంటి గుడ్డు పేద వాళ్ళని ఎలా కాపాడాడు? గుడ్డు తర్వాత గణపథ్ ఎలా అయ్యాడు? గుడ్డుకి జ్ఞానోదయం ఎలా అయ్యింది? వీళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

ganapath movie review

రివ్యూ :

2060 లో సినిమా నడుస్తుంది, మనుషులకంటే ఎక్కువ రోబోలు ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటే మీకు ఈ పాటికి ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా గుర్తు వచ్చి ఉంటుంది. ఈ సినిమా దానికి పేరడీ లాగా ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ చూపించే విషయంలోనే ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అనిపిస్తుంది. అంత గ్రాఫిక్స్ ఉంటాయి. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ కష్టపడుతూ ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. పాటలు ఉన్నాయి.

ganapath movie review

డాన్స్ ఉంది. ఏవేవో లొకేషన్స్ చూపించారు. ఇన్ని ఉన్నా సరే సినిమా మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. అంటే ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ పరంగా చాలా బాగా చేసినా కూడా నటన పరంగా మాత్రం చాలా మెరుగు పడాలి. మనకి కల్కి టీజర్ లో చూపించిన విషయాలన్నిటినీ కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంది. సినిమాకి పని చేసిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్లే.

ganapath movie review

నటుల నుండి టెక్నీషియన్స్ వరకు అందరిని బాగా గుర్తింపు పొందిన వారిని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. కానీ ఇవి ఏవి కూడా సినిమాని కాపాడలేకపోయాయి. దసరాకి తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అసలు ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. సినిమా ద్వారా ఏదో చెప్పాలి అనుకొని ప్రయత్నించారు. కానీ అది ఏదో తిరగబడింది. డబ్బింగ్ భాషలో వాళ్ళకి కాదు .బాలీవుడ్ వాళ్ళకి కూడా సినిమా నచ్చలేదు. ట్రోల్ చేయడానికి కొత్త పదాలు కూడా వెతుక్కుంటున్నారు.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సినిమాని తెరపై చిత్రీకరించిన విధానం
  • సాగదీసినట్టుగా ఉన్న స్క్రీన్ ప్లే
  • ఇంగ్లీష్ యాక్షన్ సినిమాలని గుర్తుకు తెచ్చే కొన్ని సీన్స్
  • పాత్రలని రూపొందించిన విధానం

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

ప్రభాస్ కల్కి లాగా సినిమా తీద్దాం అనుకున్నారు. కానీ సినిమాకి సంబంధించి ఏ ఒక్క విషయం కూడా సరిగ్గా చూపించలేకపోయారు. కష్ట పడినా కూడా అవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎంతో ఖర్చు పెట్టి తీసినా కూడా అంచనాలని అందుకోలేని ప్రయత్నంగా గణపథ్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అంటే…?


End of Article

You may also like