Ads
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎల్ సి యు ఇంపాక్ట్ చూపించలేకపోయింది. లోకేష్ కనకరాజు ముందు సినిమాలైన ఖైదీ విక్రమ్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు మాత్రమే. కేవలం లోకేష్ కనగరాజు సినిమా కోసమే థియేటర్ కు వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు.
Video Advertisement
ఇప్పుడు ఎక్కడ చూసినా లియో కలెక్షన్స్ గురించి టాక్ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.145 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాకు రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.17 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఇక లియో తమిళ్ నాడులో రూ.100 కోట్లు, కర్ణాటకలో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.60 కోట్ల మార్కెట్ అయింది. దీంతో వరల్డ్ వైడ్ గా లియోకు రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇది ఇలా ఉంటె…లియో సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సై**కో కి*ల్లర్ గా ఓ కుర్రాడు కనిపిస్తాడు. ఉన్నంతలో తన యాక్టింగ్ తో భయపెట్టేశాడు. ఈ వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు శాండీ మాస్టర్. అతను తమిళ సినీ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ లో కూడా పనిచేస్తున్నాడు. శాండీ 2005 లో కలైంజర్ టీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ షో ‘మానాడ మయిలాడ’ సీజన్ 1లో కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు.
ఆ షోలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత ‘మానాడ మయిలాడ’ వివిధ సీజన్లలో న్యాయనిర్ణేతల ప్యానెల్లో ఒకరిగా పనిచేశారు. 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వెర్షన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తర్వాత శాండీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తూనే సినిమాలలో కూడా నటించడం ప్రారంభించాడు. ‘ఇవనుకు తన్నిల గండం’ అనే తమిళ చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన శాండీ మాస్టర్ లియో మూవీలో నటించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాండీ మాస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
https://www.instagram.com/reel/CyAa2ZsrQoP/
End of Article