నా సామిరంగా అంటున్న కన్నడ బ్యూటీ ఆషిక అశ తీరేనా..

నా సామిరంగా అంటున్న కన్నడ బ్యూటీ ఆషిక అశ తీరేనా..

by Harika

Ads

టాలీవుడ్ లో చిరంజీవి ,బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతుంటే నాగార్జున మాత్రం సినిమాల పరంగా కాస్త వెనక పడిపోయాడు. ఈసారి ఎలాగైనా టార్గెట్ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నా సామి రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ మూవీలో నాగార్జున సరసన కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు అమిగోస్ చిత్రంలో కళ్యాణ్ రామ్ తో జతకట్టింది. అయితే ఇప్పుడు మరొక క్రేజీ ఆఫర్ తో నా సామి రంగాల్లో రాబోతున్నట్లు లేటెస్ట్ బజ్.

Video Advertisement

నాగార్జున మూవీలో హీరోయిన్లు అంటే ఎలివేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఇప్పటికే ఈ మూవీ కోసం పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ పరిశీలించడం జరిగింది. ఫైనల్ గా ఈ మూవీకి ఆషిక కరెక్ట్ గా సెట్ అవుతుంది అని భావించిన మేకర్స్ ఈమెనే సెలెక్ట్ చేశారట. ఇక ఆషికా తో పాటు మరో హీరోయిన్ కి కూడా ఈ మూవీలో రోల్ ఉంది అని తెలుస్తుంది. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి సందడి చేయడానికి బరిలోకి దిగుతుంది.

watch video:

ఇక వచ్చే సంక్రాంతికి నా సామిరంగా తో పాటు అరడజనుపైనే చిత్రాలు పోటాపోటీగా సంక్రాంతి బరిలోకి వస్తాయి. విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతికి వస్తోంది. పైగా మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ గుంటూరు కారం సంక్రాంతి రేస్ లో ఉండనే ఉంది. మరి వీటన్నిటిని దాటుకొని నా సామిరంగా క్లిక్ అవుతుందో లేదో చూడాలి. పాపం ఈ మూవీ తో అయినా టాలీవుడ్ పై గ్రిప్ తెచ్చుకోవాలి అనుకునే ఈ కన్నడ బ్యూటీ అసలు తీరుతాయో లేదో.


End of Article

You may also like