Ads
మాస్ మహారాజ రవితేజ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్ లు చేసుకునే రేంజ్ నుండి ఈరోజు స్టార్ హీరో జాబితాలో స్థానం దక్కించుకున్నాడు అంటే అది అతని కష్టానికి దక్కిన ప్రతిఫలం మాత్రమే. రవితేజ ఎప్పుడు కూడా కొత్త దర్శకులని, నిర్మాతలని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
Video Advertisement
ఎంతైనా కష్టం విలువ తెలిసినోడు కాబట్టే తాను కష్టపడుతూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం రవితేజ కి ఉంది. అయితే రవితేజ తాజాగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రం దసరాకు విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వారం రోజులకి కలెక్షన్స్ ఊపందుకున్న కూడా బయ్యర్స్ కి నష్టాలు తప్పలేదు.
దీంతో ప్రొడ్యూసర్స్ కి 25 కోట్ల రూపాయలు నష్టం కలిగిందట. ఈ విషయం తెలుసుకున్న రవితేజ తాను తీసుకున్న పారితోషకం 18 కోట్ల నుండి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసారట. రవితేజ కి కష్టం విలువ తెలుసు కాబట్టి ఎవరికీ నష్టాలు వచ్చినా చూస్తూ ఊరుకోరు, గొప్ప మనసుతో తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. అందుకే ఈ హీరోకి ఇప్పటివరకు మంచి పేరు ఉంది.
ఈ హీరో సినిమాలకి నష్టం వస్తే కేవలం నిర్మాతనే భారం అని ఎప్పుడూ తప్పుకోలేదు అంటూ మాస్ మహారాజ అభిమానులు ఆయనపై పొగడ్తలు కురిపిస్తున్నారు.ఎప్పుడూ కూడా ముక్కుసూటితనంతో ఉండే రవితేజ ఎవరిని పన్నేత్తి మాట అన్నది లేదు. ఒకరి చేత అనిపించుకున్నది లేదు. తన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోడు. నిరంతరం కష్టపడుతూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ తన అభిమానులను అలరించాలని చూస్తూ ఉంటాడు. అందుకేనేమో రవితేజకి ఫ్లాపులు ఇంట్లో సంబంధం లేకుండా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Also Read:“స్కంద” మూవీలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?
End of Article