Ads
తమిళ్ హీరో అయినా కూడా ఒక తెలుగు సినిమా చేసి, మిగిలిన డబ్బింగ్ తెలుగు సినిమాలన్నిటికీ తానే డబ్బింగ్ చెప్పుకొని, మొత్తానికి ఒక తెలుగు హీరో అయిపోయిన హీరో కార్తీ. సినిమాకి సినిమాకి తనని తాను మార్చుకుంటూ అప్పుడే కార్తీ 25 సినిమాలు చేసేసారు. ఇప్పుడు కార్తీ 25 వ సినిమా అయిన జపాన్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : జపాన్
- నటీనటులు : కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్.
- నిర్మాత : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
- దర్శకత్వం : రాజుమురుగన్
- సంగీతం : జివి ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : నవంబర్ 10, 2023
స్టోరీ :
చిన్నప్పటినుండి ఎదుర్కొన్న ఎన్నో సంఘటనల జపాన్ (కార్తీ) వల్ల దొంగగా మారుతాడు. అలా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తర్వాత పెద్ద గజదొంగగా మారిపోతాడు. దేశంలో ఉన్న ఎంతో మంది పోలీసులు జపాన్ కోసం వెతకడం మొదలు పెడతారు. అంటే జపాన్ అన్ని తప్పుడు పనులు చేశాడు. ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి జపాన్ చేసే దొంగతనంలో భాగంగా అతను కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. అప్పుడు జపాన్ ఏం చేశాడు? అక్కడ జపాన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఆ సమస్యలు కలిగించిన వ్యక్తులు ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఇందాక చెప్పినట్టుగా కార్తీ ఒక తెలుగు హీరో అయిపోయారు. చాలా మంది తెలుగు హీరోలకి సమానంగా కార్తీకి తెలుగులో క్రేజ్ ఉంటుంది. ఈ కారణంగానే కార్తీ తన డబ్బింగ్ సినిమా విడుదల చేసినప్పుడు కూడా ఒక తెలుగు సినిమా ఫీల్ రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. డబ్బింగ్ తనే చెప్పుకోవడం, పాటలు, డైలాగ్స్ ఇలాంటి విషయాల్లో కూడా ఒక క్వాలిటీ ఉండేలా చూసుకోవడం. ఇవన్నీ చేస్తారు.
ఇప్పుడు ఈ సినిమా కూడా డైరెక్ట్ తెలుగు సినిమా ఫీల్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందులోనూ ముఖ్యంగా తమిళ్ లో కార్తీ పాడిన పాటని తెలుగులో కూడా తానే పాడారు. ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా ప్రేక్షకులకి కొత్త కథ ఏమీ కాదు. చాలా బాగా కాకపోయినా కొంత వరకు తెలిసిన కథ లాగానే ఉంటుంది. కాకపోతే ఇలాంటి సినిమాలకి టేకింగ్ చాలా ముఖ్యం. అది ఎంత బాగుంటే ప్రేక్షకులు సినిమాని అంత ఆసక్తిగా చూస్తారు.
ఈ సినిమా టేకింగ్ పరంగా పర్లేదు. సినిమాలో గొప్ప హై ఎలిమెంట్స్ లేకపోయినా ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు తెర ముందు కూర్చోబెట్టే అంత ఆసక్తికరంగా సినిమా తీశారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చేయాలి అని ప్రయత్నించే నటుడు కార్తీ. ఈ సినిమాలో కూడా అలాగే ఒక కొత్త రకమైన పాత్రలో నటించారు. సాధారణంగా హీరో అంటే కేవలం మంచి పనులు చేయాలి అని ఒక మైండ్ సెట్ ఏర్పడిపోయింది.
ఒకవేళ చెడ్డ పనులు చేసినా కూడా, దాని వెనకాల ఏదో ఒక బలమైన మంచి కారణం ఉంది అని చాలా సినిమాల్లో చూపిస్తారు. కానీ ఈ సినిమాలో ఒక దొంగని ఒక దొంగలాగానే చూపించారు. అతను అలాంటి పనులు చేయడానికి వెనుక ఏదో ఒక మంచి కారణం ఉంది అని, అతను దొంగతనం చేసిన డబ్బులు అన్నిటిని తర్వాత పేద ప్రజలకు పంచి పెడతాడు అని ఇలాంటి విషయాలు ఈ సినిమాలో లేవు. దాంతో కార్తీ పాత్ర కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
అంతే కాకుండా ఈ సినిమాలో కార్తీ ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతారు. సినిమా అంతా అలా మాట్లాడడం, అలాగే వాకింగ్ స్టైల్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం ఇవన్నీ మామూలు విషయాలు కాదు. సినిమా చూస్తున్నంత సేపు అక్కడ ఉన్నది కార్తీ అని మర్చిపోతాం. జపాన్ అన్న ఒక వ్యక్తి మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాడు. అంత బాగా చేశారు. చిన్న చిన్న విషయాలలో కూడా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అభినందించాల్సినదగ్గ విషయం. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తనకు ఇచ్చిన పాత్రలో తను బానే చేశారు.
అలాగే మన సునీల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. పుష్ప సినిమా తర్వాత నుండి సునీల్ తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో సునీల్ కి మరొక మంచి పాత్ర దొరికింది. పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ లో చాలా బాగుంది. నిర్మాణ పరంగా సినిమా చాలా బాగుంది. రవి వర్మన్ అందించిన సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- కార్తీ పర్ఫార్మెన్స్
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
- హీరో పాత్రని రాసుకున్న విధానం
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే కథ
- సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
మరి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే వారికి, కార్తీ నటన కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి జపాన్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : రోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?
End of Article