Ads
పాకిస్తాన్ వన్-డే వరల్డ్ కప్ 2023 లో సెమి ఫైనల్ చేరడానికి ఇంగ్లాండ్ పై కనీసం 280 పరుగుల తేడాతో గెలవాల్సిన తరుణంలో పాకిస్తాన్ మాజీ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తమ ఆటగాళ్లకు అదిరిపోయే ఆలోచనని ఇచ్చాడు.
Video Advertisement
ముందుగా తమ పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగి బ్యాట్టింగ్ తీసుకొని టార్గెట్ సెట్ చెయ్యమన్నాడు.ఆ తరువాత ఇంగ్లాండ్ ఆటగాళ్లను బ్యాట్టింగ్ కి రాకుండా డ్రెస్సింగ్ రూమ్ కి లాక్ వెయ్యాలని అక్రమ్ సూచించాడు.అప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరు టైండ్-అవుట్ రూల్ ప్రకారం అవుట్ అవ్వుతారు అని చెప్పాడు.
శ్రీలంక పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో … 2023 వరల్డ్ కప్ నుంచి వర్చ్యువల్ గా పాకిస్తాన్ నిష్క్రమించింది అని మన అందరికి తెలిసిందే. లంక ఫై గెలిచినకివీస్ ఖాతాలో మొత్తం మీద 10 పాయింట్లు చేరాయి.చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలిస్తే పాకిస్తాన్ ఖాతాలోనూ పది పాయింట్లు చేరుతాయి.కానీ మెరుగైన నీట్ రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ సెమి-ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పాక్ సెమీస్ కి చేరుకోవాలి అంటే ఇంగ్లాండ్ పైన కనీసం 280 పరుగుల తేడాతో గెలుపొందాలి.ఒక వేళ చేసింగ్ కు దిగితే కేవలం 5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి.
అంటే పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అయితే పాక్ సెమీస్ చేరడానికి ఆ టీం మాజి పేసర్ వసీం అక్రమ్ సూపర్ ఐడియా ఇచ్చాడు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన తరుణంలో ఈ సరదా సూచన ఇచ్చారు.”పాకిస్తాన్ ఇప్పటికీ సెమీస్ కు చేరగలం. దీనికి వసీం భాయ్ ఓ ఐడియా ఇచ్చారు. అది ఏమిటంటే పాకిస్తాన్ ముందుగా బాటింగ్ చేయాలి. ఆ తరువాత ఇంగ్లాండ్ ఆటగాళ్లను 20 నిమిషాల పాటు డ్రెస్సింగ్ రూమ్ లో తాళము వేసి ఉంచాలి.అప్పుడు టైండ్ అవుట్ అవుతుంది.”అంటూ పాకిస్తాన్ టీవీ ఛానెల్ ‘ఏ స్పోర్ట్స్’ హోస్ట్ చెప్పారు.
ఇటీవల బాంగ్లాదేశ్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఆటగాడు ఏంజెలో టైండ్ అవుట్ ప్రకారం అవుట్ అయిన సంగతి దూమారం రేపింది.ఈ నేపధ్యం లోనే పాక్ మాజీ ఆటగాడు ఇలా ప్రస్తావించారు.
End of Article