Ads
మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమాన్యుయేల్ అందరికీ పరిచయం. మలయాళ సినిమాలతో తన కెరీర్ ఆరంభించిన అను తర్వాత నాచురల్ స్టార్ నాని పక్కన మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ సినిమా తోనే అను ఇమాన్యుయేల్ కి హిట్ దక్కింది.
Video Advertisement
ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. వెంటనే రాజ్ తరుణ్ సరసన చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా కామెడీ సినిమాగా హిట్ అయింది.తర్వాత అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాపాలు అవ్వడం మొదలుపెట్టారు. అను ఇమాన్యూయల్ ని తెలుగు సినిమాల్లో ఐరన్ లెగ్ గా ముద్ర వేసేసారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలో నటించింది. అది ఫ్లాప్ గా మిగిలింది. నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు, శర్వానంద్ సరసన మహాసముద్రం, అల్లు శిరీష్ పక్కన ఊర్వశివో రాక్షసివో, రవితేజ సరసన రావణాసుర ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అవడం మొదలుపెట్టాయి. దీంతో అను ఇమాన్యుయల్ తెలుగులో ఆఫర్లు కూడా తగ్గాయి.తాజాగా అమ్మడు తమిళ్ లో కార్తీ సరసన జపాన్ సినిమాలో నటించింది. అను ఇమాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కార్తీ అభిమానులు అందరూ ముందుగానే ఆందోళన చెందారు.
తాజాగా జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆటలో అరటి పండుగా మిగిలింది. అసలు అనునీ ఎందుకు తీసుకున్నారా అని సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. అయితే కథగా చూస్తే జపాన్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఈ సినిమా పుణ్యమా అంట అను ఇమాన్యుయేల్ ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా వచ్చి చేరింది. దీంతో ఇక అమ్మడికి ఆఫర్ ఇచ్చే డైరెక్టర్ ఎవరూ ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మునుముందు అను ఇయాన్యుయేల్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?
End of Article