Ads
నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి చాలామందిని కాపాడడంతో ప్రాణ నష్టం కొద్దిగా తగ్గింది. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయి మంటలను ఆర్పి వేశారు. అయితే అపార్ట్మెంట్ సెల్లార్ లో చెలరేగిన మంటలు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేలింది.
Video Advertisement
5 అంతస్తుల అపార్ట్మెంట్ లో మంటలు 4 అంతస్థుల వరకు వ్యాపించాయి.ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు తీవ్రంగా శ్రమించి పలువురిని కాపాడారు.21 మందిని రక్షించి హాస్పిటల్ కి తరలించారు.
అయితే అపార్ట్మెంట్ కింద గ్యారేజ్ లో కార్ రిపేర్ చేస్తుండగా ఆయిల్ డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలి ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. ఎక్కువగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులే మృత్యువాత పడినట్లు ఫైర్ డీజి నాగిరెడ్డి తెలిపారు.అపార్ట్మెంట్ సెల్లార్ లో ఉన్న వాహనాలన్నీ అగ్ని ఆహుతై బూడిద అయిపోయాయి. థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వారికి పొగ కారణంగా ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోయారు. వారందరినీ హాస్పిటల్ కి చేర్చారు.ఇది బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ కి సంబంధించిన షాపే కావడం గమనార్హం.
కార్ గ్యారేజ్ లో కారుని రిపేర్ చేస్తుండగా స్పార్క్ వచ్చి మంటలు వ్యాపించి కెమికల్ డ్రమ్ములు అంటుకుపోయాయి. దీంతో ప్రమాదం జరిగి అపార్ట్మెంట్ అంతా మంటలు వ్యాపించాయి.
ఈ బిల్డింగ్ ఓనర్ కి పలుచోట్ల కెమికల్ కి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కెమికల్స్ అన్నిటిని అనధికారికంగా బిల్డింగ్ కింద స్టోర్ చేశాడు. వాటి కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులైతే బిల్లింగ్ ఓనర్ పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు.
Also Read:చిరు ఇంట పార్టీలో ఆ ఒక్క హీరోకి ఆహ్వానం లేదా? ఆయన తప్ప అందరు ఉన్నారుగా ఫొటోల్లో.!
End of Article