Ads
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు మరియు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Video Advertisement
ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రీతి సింగ్ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్లారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రకుల్ ,ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ముంబైలోనే స్థిరపడ్డారు. అక్కడ ఈమెకు బాలీవుడ్ సెలబ్రిటీలతో కూడా మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి రియా చక్రవర్తితో ఈమెకు చాలా మంచి స్నేహబంధం ఏర్పడింది.
రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే అయితే సుశాంత్ మరణం తర్వాత ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే ఈమె జైలుకు కూడా వెళ్లి తన ఆత్మహత్య విషయంలో తన ప్రమేంలేదని తెలియడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.. ఇలా సుశాంత్ మరణ కేసు నుంచి బయటపడినప్పటికీ డ్ర-గ్స్ కేసు ఈమె మెడకు చుట్టుకుంది.
ఇలా డ్ర-గ్స్ కేసులో భాగంగా ఈమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే రియాతో స్నేహం కారణంగా రకుల్ ప్రీతిసింగ్ కూడా డ్ర-గ్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఈమె పేరు కూడా తెరపైకి వచ్చింది.ఇలా డ్ర-గ్స్ కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేశారు తద్వారా ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో ఏమాత్రం అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తుంది. రియాతో ఫ్రెండ్షిప్ కారణంగానే తన సినీ కెరియర్ ఇబ్బందులలో పడేసుకుందని తెలుస్తుంది.
End of Article