SPARK L.I.F.E. REVIEW: సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SPARK L.I.F.E. REVIEW: సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

అసలు ఏ అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం స్పార్క్ L .I .F .E . నవంబర్ 17 న ప్రేక్షకుల మధ్యలోకి వచ్చింది. ఈ సినిమాని చూస్తే మీకు మాటలుండవు,అంటే ఇంకో అర్ధంలో వస్తుంది.అసలు ఈ చిత్రం ఏ కోణంలోకి వస్తుంది? కామెడీనా, యక్షనా, థ్రిల్లరా తెలియట్లేదు.ఈ మూవీ తాజాగా విడుదల అయింది.ఎలా ఉందో రివ్యూ చూద్దాం….!

Video Advertisement

  • చిత్రం : స్పార్క్ L .I .F .E .
  • నటీనటులు : విక్రాంత్ రెడ్డి, మెహరీన్ పీర్జాదా, రుక్సార్ ధిల్లోన్, వెన్నెల కిషోర్
  • నిర్మాత : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్
  • దర్శకత్వం : విక్రాంత్ రెడ్డి
  • సంగీతం : హేషం అబ్దుల్ వహాబ్
  • విడుదల తేదీ : నవంబర్ 17, 2023

 

స్టోరీ :
అనన్య (రుక్సార్) మీద ఉన్న జై (విక్రాంత్) ప్రేమ భయంకరమైన సంఘటనలకు దారి తీస్తుంది. లేఖ(మెహరీన్)కి వచ్చే కలలలు ఆర్య అనే ఒక పరిచయంలేని వ్యక్తితో కలుస్తాయి. హత్యలు వరుసగా జరిగే క్రమంలో వీళ్ళ జీవితాలు మలుపు తీరుగుతాయి.అసలు ఆర్య స్నేహితుడా లేదా దుష్మనా? అన్నది ఈ కథ. ఈ చిత్రంలో ఊహించని మలుపులు ఉంటాయి.

అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు,ఎందుకు చేస్తున్నారు?పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సుహాసిని,ఆర్మీలో ఉన్న నాస్సర్ కి వీటికి సంబంధం ఉన్నాయా? పోలీస్ అయిన బ్రహ్మాజీ అసలు క్రిమినల్ ని పట్టుగొగలడా?అసలు ఆ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు ,సైకోనా?లేదా ద్వేషమా?అసలు లేఖకి జరిగినట్టు నిజ జీవితంలో కూడా జరుతుందా?ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే…

రివ్యూ :
అసలు ఈ సినిమా తీసిన డైరెక్టర్ మరియు స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు ప్రతీ కోణాన్నిఉండేలా చూసుకోవాలి అనుకున్నారు.కాని ఈ సినిమా ఫైనల్ కాపీతో వచ్చినప్పుడు అసలు డైరెక్టర్ మనకి ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో తెలియదు.అది కామెడీనా,లవ్ స్టోరీనా,థ్రిల్లేరా లేదా మర్డర్ మిస్టరీనా అని ఫిలిం చుసిన వాళ్ళు తేల్చలేకపోతున్నారు.సినిమా అంతా ఒక కలగలిసిన మిఠాయిలు ఉన్నటు ఉంటుంది.కొన్ని కెమెరా షాట్స్ చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయ్.ట్రైలర్ ని మంచిగా ఎడిటింగ్ చేసి అట్ట్రాక్ట్ చేసారు కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

ప్లస్ పాయింట్స్ :

  • ఒక సినిమాలో వేరువేరు కాన్సెప్ట్స్ ఎలా కలపకూడదో చూపించింది.
  • సీనియర్ నటులు అయిన నాస్సర్,సుహాసిని,బ్రహ్మాజీ,అన్నపూర్ణ గార్ల నటన.
  • క్లోజ్ అప్ షాట్స్.
  • వెన్నల కిషోర్ ప్రెసెన్స్.

మైనస్ పాయింట్స్:

  • సాగదీసినట్టుగా ఉండే సీన్స్
  • తెలిసిపోయే కథ
  • మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు.
  • VFX షాట్స్

రేటింగ్ :

1/5

ట్యాగ్ లైన్ :

మీకు టైగర్ 3 , కిచిడి 2 ,సప్త సాగరాలు దాటి సైడ్ B కలిపి చూసినట్టు ఉంటుంది.ఈ చిత్రం ఈ మూడు చిత్రాలు కలిపి  తీసినట్టు అర్ధం పర్ధం లేకుండా ఉంటుంది.

Watch Trailer:

ALSO READ : నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి… 29 రోజుల టోటల్ కలెక్షన్స్…


End of Article

You may also like