Ads
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 60 బోట్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 40 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఒక యూట్యూబర్ ఇచ్చిన పార్టీ కారణంగా జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఆ యూట్యూబర్ ఎవరో కాదు విశాఖపట్నానికి చెందిన లోకల్ బాయ్ నాని అంటూ అతనిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
Video Advertisement
లోకల్ బాయ్ నాని గురించి అందరికీ పరిచయమే. సముద్రంలో వేటాడే వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. తనే మెయిన్ లీడ్ గా ఒక వెబ్ సిరీస్ కూడా చేశాడు. తనకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
NTV కథనం ప్రకారం….విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడే లోకల్ బాయ్ నాని కూడా హార్బర్ లోని బోటు లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు.తన భార్య శ్రీమంతం సందర్భంగా పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.తర్వాత అగ్ని ప్రమాదం జరిగాక దానికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టాడు.అది చూసి పోలీసులు ఈ ప్రమాదానికి అతనే కారణం అని అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారించారు.అయితే విచారణ అనంతరం ఈ ఘటనకు లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చారు.నాని స్టేట్మెంట్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారణకు వచ్చారు.
అసలు ఈ ఘటనకు ఎవరు కారణం అంటూ పోలీసులు విచారించాలని లోకల్ బాయ్ నాని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.అయితే నాని జనసేన కార్యకర్త అంటూ వైసీపీ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో ప్రచురించింది. అయితే జనసేనకు లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేదు అని జనసేన నాయకులు ప్రకటించారు.ఫిషింగ్ హార్బర్ ప్రమాద కారకులను వెంటనే పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మత్స్యకారులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.
Watch Video:
లోకల్ బాయ్ నానికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు -డా.మూగి శ్రీనివాస్,మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి.
ఏ సంబంధం లేని వ్యక్తిని జనసేన పార్టీకి అంటగట్టి,వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న A1.#HelloAP_ByeByeYCP
pic.twitter.com/pBRzziAPsF— . (@MeeBidda) November 20, 2023
Also Read:చాలా రోజుల తర్వాత వచ్చిన యజమానిని చూసి… ఈ కుక్క ఏం చేసిందో తెలుసా..?
End of Article