Home Filmy Adda నాగ చైతన్య తండేల్ మూవీ టైటిల్ వెనుక అర్థం ఉన్న ఏంటో మీకు తెలుసా?

నాగ చైతన్య తండేల్ మూవీ టైటిల్ వెనుక అర్థం ఉన్న ఏంటో మీకు తెలుసా?

by Mohana Priya

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలో అంతగా సక్సెస్ కావడం లేదు. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతన్యకు సరైన హిట్ పడడం లేదు.

నాగచైతన్య మాత్రం సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.

naga chaitanya thandel movie title meaning

ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు. మత్స్యకారులలకు సంబంధించిన ఒక రియల్ స్టోరీతో సినిమాను చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య కూడా క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేయడం కోసం గ్రౌండ్ వర్క్ చేశాడు.

naga chaitanya new look

దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. దీనికి తండేల్ అనే పేరుని ఫిక్స్ చేశారు. ఇందుకోసం చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో చైతూ గుబురు గడ్డంతో ఊర మాస్ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

అక్కినేని నాగ చైతన్య సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టడంతో అసలు దీని అర్థం తెలియని చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. అయితే, తండేల్ అంటే పడవ నడిపేవాడు అని అర్థం. ఈ చిత్రంలో నాగ చైతన్య చేపల వేటకు వెళ్లి జీవనం కొనసాగించే మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోందట.

ALSO READ : MANGALVARAM MOVIE ACTRESS: మంగళవారం సినిమాలో హీరోయిన్ కంటే ఈ అమ్మాయే హైలైట్ అయ్యింది..! ఎవరంటే..?

You may also like