KOTABOMMALI P.S REVIEW : “శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

KOTABOMMALI P.S REVIEW : “శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ప్రముఖ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా కోటబొమ్మాళి పి.ఎస్. ఈ సినిమా పాట ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : కోటబొమ్మాళి పి.ఎస్
  • నటీనటులు : శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.
  • నిర్మాత : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
  • దర్శకత్వం : తేజ మార్ని
  • సంగీతం : రంజిన్ రాజ్
  • విడుదల తేదీ : నవంబర్ 24, 2023

kotabommali ps movie review

స్టోరీ :

సినిమా అంతా కూడా కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది. అక్కడ కానిస్టేబుల్స్ గా పని చేసే రామకృష్ణ (శ్రీకాంత్), రవి (రాహుల్ విజయ్), అక్కడే ఉండే కుమారి (శివాని రాజశేఖర్) కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. దాని నుండి వారు ఎలా బయటపడ్డారు? అసలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాళ్లు నిర్దోషులు అని నిరూపించుకోగలిగారా? పోలీసుల నుండి వీళ్లు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

kotabommali ps movie review

రివ్యూ :

ఒకప్పుడు హీరోగా మాత్రమే నటించిన శ్రీకాంత్, ఇప్పుడు నటనకి ఆస్కారం ఉన్న ఎలాంటి పాత్రలో అయినా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమా. సినిమాలో శ్రీకాంత్ పాత్ర చాలా కీలకమైనది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమా ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాని ఇప్పటికే చాలా మంది ఓటీటీలో చూసేసారు కూడా. దాంతో ఈ సినిమా చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. కంటెంట్ పరంగా సినిమా చాలా బలంగా ఉంది.

kotabommali ps movie review

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. వరలక్ష్మి కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. అలాగే మురళీ శర్మ కూడా రాజకీయ నాయకుడు అనే తన పాత్రకి తగ్గట్టు నటించారు. నటీనటుల అందరి నటన చాలా సహజంగా ఉంది.

kotabommali ps movie review

ఇదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. పాటల్లో ఇప్పటికే హిట్ అయిన లింగిడి పాట కొరియోగ్రఫీ పరంగా కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే అన్ని వర్గాల ఆడియన్స్ కి సినిమా ఆసక్తికరంగా అనిపించే అవకాశాలు తక్కువ. ఎంటర్టైన్మెంట్ మాత్రం కోరుకునే ఆడియన్స్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని సీన్స్ లో కూడా లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ విషయాల్లో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • నటీనటులు
  • డైలాగ్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
  • లాజిక్ మిస్ అయిన కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ. ఈ సినిమా అలాంటి ఒక సినిమానే. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాగా కోటబొమ్మాళి పి.ఎస్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : నాగచైతన్య దూత ట్రైలర్ లో కనిపించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా…?


End of Article

You may also like