బర్రెలక్క ఆస్తులు ఎంత..? అప్పులు ఎంత..? ఆమె ఎన్నికల అఫిడవిట్ లో ఏం ఉందంటే….?

బర్రెలక్క ఆస్తులు ఎంత..? అప్పులు ఎంత..? ఆమె ఎన్నికల అఫిడవిట్ లో ఏం ఉందంటే….?

by Mounika Singaluri

Ads

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలు అన్ని పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రం ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష (బర్రెలక్క) నిర్వహిస్తున్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Video Advertisement

కొన్నేళ్ల క్రితం కరోనా సమయంలో గేదెలు కాస్తూ తీసిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమయంలో ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అందుకే గేదెలు కాస్తున్నానని చెప్తూ పాపులర్ అయ్యింది బర్రెలక్క అలియాస్ శిరీష.ఇప్పుడు ఎన్నికల బరిలో దిగి, అదే బర్రెలక్క పేరును ఎన్నికల అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు.

barrelakka

డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.తన దగ్గరున్న నగదు చేతిలో రూ. 5,000, బ్యాంకు ఖాతాలో రూ.1500 ఉన్నాయని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి తనపై ఒక కేసు (ఐపీసీ 505 (2)) కోర్టులో ఉన్నట్లుగా ప్రస్తావించారు.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో తనకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయని వాటి వివరాలను నమోదు చేశారు.ఇన్‌స్టాగ్రాంలో ఈమెకు 5.73 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.07 లక్షలమంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఉన్నారని చెప్పారు.

నగదు మినహా, తనకు ఆస్తులు, వాహనాలు ఏమీ లేవని, అప్పులు కూడా లేవని రాశారు.ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తుపై ఆమె పోటీ చేస్తున్నారు.బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. నిరుద్యోగ సమస్యనే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్న బర్రెలక్క, తనని గెలిపిస్తే, నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం,ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు నిర్వహణ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పుడు బర్రెలకు సోషల్ మీడియా వేదికగా మంచి మద్దతు లభిస్తుంది. నియోజకవర్గంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

 

Also Read:బాబా రాందేవ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా…? ఆయన ఆస్తులు విలువ ఎంతంటే…?


End of Article

You may also like